ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో మహిళల 75 కిలోల బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన లవ్లీనా బోర్గోహెయిన్‌కు ప్రధానమంత్రి అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 02 OCT 2026 6:05PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో మహిళల 75 కిలోల బాక్సింగ్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన లవ్లీనా బోర్గోహెయిన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో 5-0 తేడాతో ఘన విజయం సాధించి ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.

 

లవ్లీనా క్రీడా ప్రస్థానం అసాధారణమైన దృఢ సంకల్పం, ప్రతిభకు నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

లవ్లీనా బోర్గోహెయిన్‌ భవిష్యత్‌ ప్రయత్నాల్లో మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

 

“ లవ్లీనా బోర్గోహెయిన్‌ అద్భుత ప్రదర్శన కనబరిచారు! ఆసియా క్రీడల్లో మహిళల 75 కిలోల బాక్సింగ్‌ విభాగంలో ఫైనల్‌లో 5 - 0 తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకున్న లవ్లీనా బోర్గోహెయిన్‌కు అభినందనలు. ఆమె క్రీడా ప్రస్థానం అసాధారణమైన దృఢ సంకల్పం, ప్రతిభకు నిదర్శనం. భవిష్యత్‌ లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొంది.   

 

***


(రిలీజ్ ఐడి: 2318398) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Gujarati , Tamil , Malayalam