ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో మహిళల స్కిఫ్ విభాగంలో కాంస్యం గెలుచుకున్న హర్షిత తోమర్, శీతల్ వర్మలకు ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 02 OCT 2026 1:18PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో మహిళల స్కిఫ్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన హర్షిత తోమర్‌, శీతల్‌ వర్మలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

దృఢ సంకల్పం, నిలకడైన ప్రదర్శనతో వారు భారత్‌కు పతకాన్ని సాధించిపెట్టడమే కాకుండా.. గత ప్రదర్శన కంటే మెరుగైన ఫలితాన్ని నమోదు చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

హర్షితా తోమర్‌, శీతల్‌ వర్మల భవిష్యత్తు‌ ప్రయత్నాలకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టులో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.

 

“ఆసియా క్రీడల్లో మహిళల స్కిఫ్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన హర్షిత తోమర్‌, శీతల్‌ వర్మలకు అభినందనలు. దృఢ సంకల్పం, నిలకడైన ప్రదర్శనతో వారు భారత్‌కు పతకాన్ని సాధించిపెట్టడంతోపాటు.. గత ప్రదర్శనను కూడా మెరుగుపరిచారు. వారి భవిష్యత్తు‌ ప్రయత్నాలకు శుభాకాంక్షలు: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’


(రిలీజ్ ఐడి: 2318374) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam