ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడలలో రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రజత సాధించిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ అనిల్ మోహోద్‌లకు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2026 1:22PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో రికర్వ్ మిక్స్‌డ్ జట్టు విభాగంలో రజత పతకం సాధించిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ అనిల్ మోహోద్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
అద్భుతమైన నైపుణ్యం, ఉత్సాహాన్ని ప్రదర్శించిన వారు, ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో భారత్‌కు తొలిసారిగా రజత పతకాన్ని అందించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఈ చిరస్మరణీయ విజయాన్ని సాధించిన ఇద్దరు ఆర్చర్లను అభినందించిన శ్రీ మోదీ.. వారి భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘అద్భుతమైన రజతం.
ఆసియా క్రీడల్లో రికర్వ్ మిక్స్‌డ్ జట్టు విభాగంలో రజత పతకం సాధించిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మోహోద్‌ల విజయంపై గర్వంగా ఉంది.
వారు అద్భుతమైన నైపుణ్యం, ఉత్సాహాన్ని ప్రదర్శించి, ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో మన దేశానికి తొలిసారిగా రజత పతకాన్ని అందించారు.
ఈ చిరస్మరణీయ విజయాన్ని సాధించిన మన ఇద్దరు ఆర్చర్లకు అభినందనలు. వారి భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’
(రిలీజ్ ఐడి: 2318372)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam