ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో చరిత్రాత్మక స్వర్ణం సాధించిన అంకితా భకత్, కుంకుమ్ అనిల్ మోహోద్, కీర్తిలను అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 OCT 2026 1:20PM by PIB Hyderabad

ఆసియా క్రీడల మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించిన అంకితా భకత్, కుంకుమ్ అనిల్ మోహోద్, కీర్తిలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

 

హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో వారి సంయమనం, కచ్చితత్వం అద్భుతమని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ చరిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగా అనేక మంది యువ ఆర్చర్లకు స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు.

 

ఈ ఛాంపియన్‌లను చూసి భారత్ గర్విస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. అంకితా భకత్, కుంకుమ్ అనిల్ మోహోద్, కీర్తిలకు వారి భవిష్యత్ ప్రయత్నాల కోసం శుభాకాంక్షలు తెలిపారు.

 

 ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

 

యావత్ దేశాన్ని ఆనందపరిచిన చరిత్రాత్మక స్వర్ణం.

 

ఆసియా క్రీడల్లో మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని సాధించిన అంకితా భకత్, కుంకుమ్ అనిల్ మోహోద్, కీర్తిలకు అభినందనలు. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో వారి సంయమనం, కచ్చితత్వం అద్భుతం. ఈ చరిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగా అనేక మంది యువ ఆర్చర్లకు స్ఫూర్తినిస్తుంది. మన ఛాంపియన్‌లు సాధించిన ఘనత పట్ల భారత్ గర్విస్తోంది! వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు.


(రిలీజ్ ఐడి: 2318368) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Gujarati , Tamil , Kannada , Malayalam