సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ మీడియా కేంద్రంలో ‘స్వచ్ఛతా హీ సేవా 2026’ కార్యక్రమాలను నిర్వహించిన పత్రికా సమాచార కార్యాలయం

మొక్కలు నాటడం, సామూహిక పరిశుభ్రత కార్యక్రమం, సఫాయి మిత్రుల సన్మానంతో ‘స్వచ్ఛతా హీ సేవా 2026’ను నిర్వహించిన బ్యూరో

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2026 4:39PM by PIB Hyderabad

స్వచ్ఛతా హీ సేవా 2026 ప్రచారంలో భాగంగా పర్యావరణ సుస్థిరత, పరిశుభ్రత, పారిశుధ్యం, పారిశుధ్య కార్మికుల గుర్తింపునకు ప్రాధాన్యతనిస్తూ పీఐబీ ప్రధాన కార్యాలయంలోని జాతీయ మీడియా కేంద్రం (ఎన్‌ఎంసీ)లో పలు కార్యక్రమాలను నిర్వహించారు.

 

‘ఏక్‌ పెడ్‌ మా కే నామ్‌’ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్‌ 30న మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన పర్యావరణాన్ని నిర్మించడంలో సమష్టి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు, పర్యావరణ సుస్థిరతను పెంపొందించడం, పచ్చదనాన్ని విస్తరించడం ఈ కార్యక్రమం లక్ష్యం. చెట్లను సంరక్షించడం, పర్యావరణ పరిరక్షణను ఉమ్మడి బాధ్యతగా భావించాల్సిన ప్రాముఖ్యతనూ ఈ కార్యక్రమం చాటిచెప్పింది. 

 

నేడు ‘ఏక్‌ దిన్‌, ఏక్‌ ఘంటా, ఏక్‌ సాథ్‌’ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్‌ఎంసీ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, నిర్వహణపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన కార్యాలయ వాతావరణాన్ని కొనసాగించడంలో అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం కావాలని ప్రోత్సహించారు. స్వచ్ఛ భారత్‌ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో పారిశుధ్యం, పరిశుభ్రత, సమష్టి బాధ్యత ప్రాధాన్యతను కూడా ఈ కార్యక్రమం తెలియజేసింది. 

నేడు ఎన్‌ఎంసీలో సఫాయి మిత్రులు, స్వచ్ఛాగ్రహులు, పారిశుధ్య కార్మికుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయంలో పరిశుభ్రత, పారిశుద్ధ్యాన్ని కొనసాగించడంలో వారు అందిస్తున్న అంకితభావంతో కూడిన సేవలు, విలువైన కృషిని, సహకారాన్ని అభినందించారు. పారిశుధ్య కార్మికుల పాత్రను గుర్తించి, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పర్యావరణం కోసం వారు అందిస్తున్న సేవలను నిరంతరం ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

 

 

 

పీఐబీ ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అధికారులు, సిబ్బంది పాల్గొని, పర్యావరణ సుస్థిరత, పరిశుభ్రత, పచ్చదనంతో కూడిన ఆరోగ్యకరమైన భవిష్యత్తు పట్ల సంస్థకున్న నిబద్ధతను చాటారు.

 

ఈ కార్యక్రమాల ద్వారా స్వచ్ఛతా హీ సేవా 2026 లక్ష్యాల పట్ల పీఐబీకి ఉన్న నిబద్ధతతో పాటు, పరిశుభ్రత, పర్యావరణ బాధ్యత, సమష్టి భాగస్వామ్య సంస్కృతిని ప్రోత్సహించాలన్న సంస్థ సంకల్పం ప్రతిబింబించింది.

***

 


(రిలీజ్ ఐడి: 2318342) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Tamil , Kannada , Malayalam