ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడలు 2026లో కాంస్యం గెలిచిన భారత మహిళా స్క్వాష్ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 4:37PM by PIB Hyderabad
ఆసియా క్రీడలు 2026లో కాంస్య పతకం సాధించిన భారత మహిళల స్క్వాష్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
జట్టు స్ఫూర్తిదాయకమైన పోరాటాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. క్రీడాకారిణులు ఎంతో పట్టుదలతో ఆడి, విజేతగా నిలిచి పతకం సాధించారని కొనియాడారు.
భారత్‌లో స్క్వాష్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విజయం యువతను ఈ క్రీడ వైపు మరింత ఆకర్షించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘ఆసియా క్రీడలు 2026లో కాంస్య పతకం సాధించిన భారత మహిళల స్క్వాష్ జట్టును చూసి గర్విస్తున్నాను. వారి అద్భుతమైన ఆటతీరుకు అభినందనలు. ఎంతో పట్టుదలతో ఆడి విజేతగా నిలిచి పతకం సాధించారు.. భారత్‌లో స్క్వాష్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విజయం యువతను ఈ క్రీడ వైపు మరింత ప్రోత్సహిస్తుంది: ప్రధానమంత్రి.. @narendramodi”
(రిలీజ్ ఐడి: 2318339)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam