ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అక్టోబరు 1న భారత్ మండపంలో యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధాని


యూపీఎస్సీ శతాబ్ది వేడుకల సందర్భంగా స్మారక నాణెం, స్టాంపును విడుదల చేయనున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 30 SEP 2026 2:09PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో2026 అక్టోబరు 1న నిర్వహించనున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారు. ఉదయం 11 గంటల సమయంలో కార్యక్రమానికి హాజరు కానున్న ఆయన.. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు.

1926లో యూపీఎస్సీని నెలకొల్పి వందేళ్లు పూర్తయిన సందర్భంగా.. గతేడాది అక్టోబరు 1న ప్రారంభమై, ఏడాది పొడవునా సాగిన శతాబ్ది ఉత్సవాలు ఈ కార్యక్రమంతో ముగియనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణేన్ని, స్మారక తపాలా బిళ్ళను, ‘భారత్‌లో యూపీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విధానాలకు రూపుదిద్దిన 100 కీలక తీర్పులు’ అనే పుస్తకాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు.

వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులతోపాటు.. దేశవ్యాప్తంగా సంబంధిత భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

యూపీఎస్సీ 2026 సెప్టెంబరు 30, అక్టోబరు 1 తేదీల్లో  నిర్వహిస్తున్న రెండు రోజుల ఉత్సవంలో ఈ కార్యక్రమం ఒక భాగం. మొదటి రోజు భారత్ మండపంలో ‘శతాబ్ది సమరోహ్ - మంథన్’ కార్యక్రమం ఉంటుంది. ప్రముఖ వక్తల ప్రసంగాలు, అనంతరం వివిధ అంశాలపై నిపుణుల బృందాల చర్చలు ఇందులో ఉంటాయి.  


(రిలీజ్ ఐడి: 2317059) సందర్శకుల సూచీ సంఖ్య : : 3