ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆండీ బర్న్‌హాంకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 21 JUL 2026 8:09AM by PIB Hyderabad

యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆండీ బర్న్‌హాంకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలతో యూకే, భారత్ అనుసంధానమై ఉన్నాయని, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ, ప్రజా సంబంధాల్లో విస్తృత సహకారం ఉందని శ్రీ మోదీ అన్నారు. ఈ నెలలో సీఈటీఏ అమల్లోకి రావడంతో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత బలోపేతం కానుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

భారత్-యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, రెండు దేశాల ఉమ్మడి విజన్ - 2035ను ముందుకు తీసుకెళ్లడానికి ఆయనతో కలసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘యూకే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆండీ బర్న్‌హాంకు ఆత్మీయ శుభాకాంక్షలు.

ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలతో భారత్, యూకే అనుసంధానమై ఉన్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ, ప్రజాసంబంధాల్లో విస్తృత సహకారం ఉంది. ఈ నెలలో అమల్లోకి వచ్చిన సీఈటీఏతో మన ద్వైపాక్షిక వాణిజ్యం మరింత బలోపేతం కానుంది.

భారత్-యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, మన ఉమ్మడి దార్శనికత – 2035ను ముందుకు తీసుకెళ్లడానికి మీతో కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను.’’

***


(రిలీజ్ ఐడి: 2316862) సందర్శకుల సూచీ సంఖ్య : : 14