ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో పురుషుల 4×400 మీటర్ల రిలే కాంస్య విజేతలు ధర్మవీర్ చౌదరి.. మను.. విశాల్.. జై కుమార్‌లకు ప్రధానమంత్రి అభినందన
నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2026 9:41PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో పురుషుల 4×400 మీటర్ల రిలే విభాగం కాంస్య పతక విజేతలు ధర్మవీర్ చౌదరి, మను టి.ఎస్., జై కుమార్, విశాల్ టి.కె.లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ బృందం అద్భుత సమన్వయంతో పతకాన్ని కైవసం చేసుకున్నదని పేర్కొన్నారు.
భారత క్రీడారంగం ఉజ్వల భవిష్యత్తు దిశగా ఈ జట్టు సాధించిన విజయం ఎంతో స్ఫూర్తినివ్వగలదని శ్రీ మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఇది అత్యద్భుత విజయం అనడంలో సందేహం లేదు! పురుషుల 4×400 మీటర్ల రిలేలో అసమాన సమన్వయంతో కాంస్య పతకం నెగ్గిన ధర్మవీర్ చౌదరి, మను టి.ఎస్., జై కుమార్, విశాల్ టి.కె.లకు నా హృదయపూర్వక అభినందనలు. భారత క్రీడారంగం ఉజ్వల భవిష్యత్తుకు వారి విజయం దోహదం చేస్తుందని ఆశిస్తూ, నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది.
***
(రిలీజ్ ఐడి: 2316835)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam