ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో మహిళల 5000 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించిన పారుల్ చౌదరికి ప్రధానమంత్రి అభినందన
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 9:15PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో మహిళల 5000 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించిన పారుల్ చౌదరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఆమె సాధించిన విజయం ఔత్సాహిక క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
“ఆసియా క్రీడల్లో మహిళల 5000 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించిన పారుల్ చౌదరికి అభినందనలు. ఆమె విజయం ఔత్సాహిక క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. భవిష్యత్తులో ఆమె చేపట్టే ప్రయత్నాల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొంది.
***
(రిలీజ్ ఐడి: 2316367)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam