ప్రధాన మంత్రి కార్యాలయం
భారతీయ చదరంగ క్రీడాకారులకు ప్రధాని అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 12:19PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు... 46వ ఫిడె చెస్ ఒలింపియాడ్‌లో విజయం సాధించిన భారతీయ చదరంగ క్రీడాకారులను అభినందించారు.
వారి అంకితభావం, సంకల్పం ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి అన్నారు. వారు సాధించిన విజయాలు... చదరంగం ఆడేలా, ఈ క్రీడలో రాణించేలా మరింత మంది యువతకు స్ఫూర్తినిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:
‘‘మన చెస్ క్రీడాకారులకు అభినందనలు! వారి అంకితభావం, సంకల్పం ఆదర్శప్రాయమైనవి.
ఈ విజయాలు చెస్ ఆడేలా, ఈ క్రీడలో రాణించేలా మరింత మంది యువతకు స్పూర్తినిస్తాయని ఆశిస్తున్నాను’’.
(రిలీజ్ ఐడి: 2315983)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8