సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
సాధన శృంఖల 2026: వివిధ ప్రాంతాలలోని శిక్షణ సంస్థల పరివర్తన దిశగా చొరవ
శిక్షణ సంస్థల నుండి సామర్థ్య నిర్మాణ సంస్థలుగా రూపాంతరం
పౌర కేంద్రక ('నాగరిక్ దేవో భవ') పాలన యొక్క ప్రాథమిక సూత్రాలను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు
విజయవాడ (ఆంధ్రప్రదేశ్), గువాహటి (అస్సాం), లక్నో (ఉత్తరప్రదేశ్) మరియు పుణే (మహారాష్ట్ర) లలో నాలుగు ప్రాంతీయ వర్క్‌షాప్‌ల నిర్వహణ
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 10:47AM by PIB Vijayawada

మిషన్ కర్మయోగి కింద శిక్షణ సంస్థలను వ్యూహాత్మక, సామర్థ్య-ఆధారిత 'సామర్థ్య నిర్మాణ సంస్థలు'గా మార్చే ప్రక్రియను వేగవంతం చేసేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (సిబిసి) 'సాధన శృంఖల 2026' పేరుతో దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
2026 ఏప్రిల్ 02 నుండి 08 వరకు జరిగిన 'సాధన సప్తాహ్ 2026' లో నాలుగు ప్రాంతీయ టాస్క్ ఫోర్స్‌లు చేసిన సంప్రదింపులు, అలాగే 2026 మే 15న "ఇన్స్టిట్యూషనలైజింగ్ కెపాసిటీ బిల్డింగ్: ఫ్రమ్ ట్రైనింగ్ టు పెర్ఫార్మెన్స్ లింక్డ్ గవర్నెన్స్" పై జరిగిన నేషనల్ డిపార్ట్‌మెంటల్ సమ్మిట్‌లో వ్యక్తమైన అభిప్రాయాల ఆధారంగా ఈ సాధన శృంఖల రూపుదిద్దుకుంది.
ఈ సాధన శృంఖల ప్రాంతీయ కార్యశాలలు ప్రతి ప్రదేశంలోనూ ఒకటిన్నర రోజు పాటు నిర్వహించబడతాయి. ఈ సమావేశాలలో ఆయా ప్రాంతాలలోని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు, శిక్షణ సంస్థల అధిపతులు, అధ్యాపకులు, ప్రభుత్వ రంగ సంస్థల (PSUs) ప్రతినిధులు, పరిశ్రమ భాగస్వాములు, విషయ నిపుణులు మరియు స్టార్టప్‌ల ప్రతినిధులు ఒకే వేదికపైకి రానున్నారు.
ఈ ప్రాంతీయ కార్యశాలల సిరీస్ దక్షిణ ప్రాంత వర్క్‌షాప్‌తో ప్రారంభమవుతుంది. 2026 సెప్టెంబర్ 29-30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో మొదటి వర్క్‌షాప్, అక్టోబర్ 9-10 తేదీల్లో అస్సాంలోని గువాహటిలో ఈశాన్య ప్రాంత కార్యశాల, అక్టోబర్ 23-24 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉత్తర ప్రాంత కార్యశాల, మరియు నవంబర్ 16-17 తేదీల్లో (పరిశీలనలో ఉంది) మహారాష్ట్రలోని పుణేలో పశ్చిమ ప్రాంత కార్యశాల నిర్వహించబడతాయి. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో, ఆతిథ్య రాష్ట్రాల గౌరవ ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ఈ కార్యశాలలు ప్రారంభమవుతాయి.
విజయవాడలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ దక్షిణ ప్రాంతీయ కార్యశాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, కేరళ మరియు పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
సాధన శృంఖల సంస్థాగత రూపాంతరంపై జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చలను మరింత స్పష్టత మరియు కార్యాచరణ దిశగా తీసుకెళ్లేందుకు ప్రాంతీయ స్థాయికి విస్తరిస్తోంది. శిక్షణ సంస్థలు కేవలం సాధారణ శిక్షణా కేంద్రాలుగా మాత్రమే కాకుండా, వ్యూహాత్మక సామర్థ్య నిర్మాణ సంస్థలుగా మారడానికి ఒక ఏకీకృత నిర్మాణం అత్యవసరమని మునుపటి సంప్రదింపుల ద్వారా వెల్లడైంది.
ముఖ్య లక్ష్యం
వివిధ సంస్థాగత అవసరాలకు అనుగుణంగా స్పందించేలా శిక్షణ సంస్థలను రూపాంతరం చేయడంలో రాష్ట్రాలు, శిక్షణ సంస్థలు, ఇతర భాగస్వాములను భాగస్వామ్యులను చేయడమే ఈ ప్రాంతీయ కార్యశాలల ముఖ్య లక్ష్యం. ప్రభుత్వం నిర్దేశించిన పాత్రల ఆధారిత సామర్థ్య అవసరాలను నిర్దిష్ట సంస్థాగత చర్యలుగా మలిచే 'కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్స్' (సిబిపి) ద్వారా — సరియైన సమయానికి, సరియైన పాత్రకు, సరియైన సామర్థ్య నిర్మాణం అందించడం దీని ఉద్దేశం.
సంస్థాగత పాలన మరియు నాయకత్వం, కార్యాచరణ సమర్థత, పరస్పర సహకారం, 'కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్' (KQF) కు అనుగుణంగా శిక్షణ నాణ్యత పెంపుదల, అధ్యాపకులు మరియు సామర్థ్య వికాసం, అలాగే డిజిటల్ మరియు నూతన సాంకేతికతల క్రమబద్ధమైన వినియోగం కోసం అవసరమైన నమూనాల రూపకల్పనపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు.
ఈ రూపాంతర ప్రక్రియ అమలు 'యునిఫైడ్ న్యూ-ఏజ్ నేషనల్ ట్రైనింగ్ ఇనిషియేటివ్' (UNNATI) పోర్టల్ ద్వారా సాధించబడుతుంది. 900 కంటే ఎక్కువ శిక్షణ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా, ఉన్నతి (UNNATI) పోర్టల్ నిర్దేశిత నమూనా లక్ష్యాలను ఆచరణలోకి తెస్తుంది. ఇది సంస్థల మధ్య పారదర్శకతను, సులభతర సహకారాన్ని పెంపొందించడమే కాకుండా డేటా ఆధారిత నిరంతర అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. ఉన్నతి ఎక్స్ఛేంజ్ ద్వారా శిక్షణ నెట్‌వర్క్‌లోని కోర్సులు, అధ్యాపకులు, మౌలిక సదుపాయాలను పరస్పరం పంచుకోవడానికి సౌలభ్యం కలుగుతుంది.
ఈ సంప్రదింపుల ద్వారా లభించే విలువైన అభిప్రాయాలు 'శిక్షణ సంస్థల రూపాంతర ఫ్రేమ్‌వర్క్' ముగింపు రూపకల్పనకు దోహదపడతాయి. 'వికసిత్ భారత్ @ 2047' సాధన దిశగా పౌరులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు వీలుగా ప్రభుత్వ వ్యవస్థలోని అన్ని స్థాయిల అధికారులను (ఆశా కార్యకర్తల నుండి కార్యదర్శుల వరకు) సద్ధం చేయడంలో 'మిషన్ కర్మయోగి' కట్టుబడి ఉందనే విషయాన్ని ఇది పునరుద్ఘాటిస్తుంది.
పౌర కేంద్రక ('నాగరిక్ దేవో భవ') పాలనా భావనను ముందుకు తీసుకెళ్తూ, జాతీయ స్థాయి సంప్రదింపుల నుండి 'ప్రజా భాగస్వామ్య' (జన్ భాగీదారి) స్ఫూర్తిని ప్రాంతీయ స్థాయికి సాధన శృంఖల తీసుకెళుతుంది. దీని ద్వారా మిషన్ కర్మయోగి కింద అనుసంధానిత, చురుకైన మరియు భవిష్యత్తు సవాళ్లకు సిద్ధంగా ఉండే సామర్థ్య నిర్మాణ వ్యవస్థ నిర్మాణం సుసాధ్యమవుతుంది.
*****
(రిలీజ్ ఐడి: 2315971)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5