ప్రధాన మంత్రి కార్యాలయం
లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నివాళి
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 9:27AM by PIB Hyderabad
సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆమెకు సగౌరవ నివాళి అర్పించారు. దైవదత్తమైన దివ్య గాన ప్రతిభతో భారత్ కీర్తిప్రతిష్టలను ఆమె ప్రపంచవ్యాప్తం చేశారని శ్రీ మోదీ కొనియాడారు.
లతా మంగేష్కర్ తన మధుర స్వరంతో దేశ పౌరులను సంగీత సాగరంలో ఓలలాడించడమే కాకుండా జాతి శ్రేయస్సు సంబంధిత ప్రతి కార్యక్రమానికీ తన గళ సహకారం అందించారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారతీయ సంగీత ప్రపంచానికి ఆమె అసమాన సేవలు తరతరాలకూ స్ఫూర్తినిస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“భారతీయ సంగీత ప్రశస్తిని తన దివ్య గళ మాధుర్యంతో ప్రపంచవ్యాప్తం చేసిన గానకోకిల, గౌరవనీయ సోదరి లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమెకు నా వినమ్ర నివాళి. ఆమె తన మధుర స్వరంతో దేశవ్యాప్త సంగీత ప్రియులను హృదయాలను రంజింపజేశారు. దేశ సంక్షమానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ తన వంతుగా గళ సహకారం అందించారు. ముఖ్యంగా భారతీయ సంగీత లోకానికి ఆమె అసమాన సేవలు తరతరాలకూ చిరస్మరణీయం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2315827)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam