ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ పోటీలో రజత పతకం సాధించిన తిలోత్తమ సేన్, విదర్స వినోద్ కొచులెంకల్, ఆషి చౌక్సేలను అభినందించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 26 SEP 2026 7:48PM by PIB Hyderabad

ఆసియా క్రీడల్లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ పోటీలో రజత పతకం సాధించిన తిలోత్తమ సేన్, విదర్స వినోద్ కొచులెంకల్, ఆషి చౌక్సేల అద్భుతమైన ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. 

వారికి అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో వారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

"తిలోత్తమ సేన్, విదర్స వినోద్ కొచులెంకల్, ఆషి చౌక్సేలు అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచారు!

ఆసియా క్రీడల్లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ పోటీలో రజత పతకం సాధించినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు.

రాబోయే కాలంలో వారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ”


(రిలీజ్ ఐడి: 2315816) సందర్శకుల సూచీ సంఖ్య : : 10