ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్ టేబుల్ టెన్నిస్‌లో కాంస్య పతకం సాధించిన మానుష్ షా, దియా చితాలేకు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
26 SEP 2026 7:53PM by PIB Hyderabad
ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకం సాధించిన మానుష్ షా, దియా చితాలేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ పతకం భారత్‌లో టేబుల్ టెన్నిస్‌కు పెరుగుతున్న ఆదరణకు మరో గర్వకారణమైన సందర్భాన్ని జోడించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వారి దృఢ సంకల్పం ఎంతోమంది యువ క్రీడాకారులను టేబుల్ టెన్నిస్‌ను క్రీడగా ఎంచుకుని, మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునేలా స్ఫూర్తినిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
“ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకం సాధించిన మానుష్ షా, దియా చితాలేకు అభినందనలు. ఈ పతకం భారత్‌లో టేబుల్ టెన్నిస్‌కు పెరుగుతున్న ఆదరణకు మరో గర్వకారణమైన సందర్భాన్ని జోడించింది. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి నా శుభాకాంక్షలు. వారి దృఢ సంకల్పం ఎంతోమంది యువ క్రీడాకారులను ఈ క్రీడను ఎంచుకుని, మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునేలా స్ఫూర్తినిస్తుంది” అని శ్రీ నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2315398)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10