ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ వృద్ధికీ, సౌభాగ్యానికీ జోరును అందించడంలో ‘మేక్ ఇన్ ఇండియా’ పోషిస్తున్న పాత్రను ప్రస్తావించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2026 12:50PM by PIB Hyderabad
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి 12 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.
భారతదేశం అభివృద్ధికీ, సౌభాగ్యానికీ దోహదం చేసే మౌలిక సదుపాయాలు, వాణిజ్య వ్యవస్థ, నూతన ఆవిష్కరణలను సమకూర్చడం ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యమని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘భారత్ అభివృద్ధి, సౌభాగ్య పథంలో దూసుకుపోవడానికి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించడం, వాణిజ్య వ్యవస్థను తీర్చిదిద్దడంతో పాటు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ‘మేక్ ఇన్ ఇండియా’ ధ్యేయం.
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం అమల్లోకి వచ్చి పుష్కర కాలమైంది’’ అని పేర్కొన్నారు. ఈ సందేశానికి ఒక వీడియోను కూడా జోడించారు.
***
(రిలీజ్ ఐడి: 2314841)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam