రక్షణ మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఊతం: ఐఏఎఫ్ కోసం 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ ఆయుధాల కొనుగోలుకు బీడీఎల్‌తో రూ.811 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ఎంఓడీ
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2026 4:45PM by PIB Hyderabad
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోసం 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ ఆయుధాలు (ఎస్ఏటీ-ఎస్ఏఏడబ్ల్యూ), సంబంధిత పరికరాలను కొనుగోలు చేయటానికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)తో రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. బై (ఇండియన్- స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి, తయారీ) కేటగిరి ద్వారా కుదిరిన ఈ ఒప్పందం విలువ రూ.810.79 కోట్లు. సెప్టెంబర్ 23, 2026న రక్షణ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
జాగ్వార్, హాక్, సు-30 ఎంకేఐ వంటి వాటి ద్వారా ప్రయోగించగల ఎస్ఏటీ-ఎస్ఏఏడబ్ల్యూ… గగనతలం నుంచి భూమి ఉపరితలం పైకి ప్రయోగించే ఖచ్చితమైన గ్లైడ్ బాంబ్. ఇది సుదూర ప్రాంతాల నుంచే శత్రువుల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయగల సామర్థ్యం కలది. డీఆర్‌డీఓ దేశీయంగా రూపొందించి, అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థలో 60 శాతం స్వదేశీ పరికరాలుంటాయి. రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను మరింత పెంపొందించేందుకు ఇనిషియల్ మెజర్‌మెంట్ యూనిట్, లాంగ్ ఇంపాక్ట్ డిలే ఫ్యూజ్, ట్విన్ స్టోర్ క్యారియర్ వంటి ఉప-వ్యవస్థలను దేశీయంగా అభివృద్ధి చేశారు.
ఎస్ఏటీ-ఎస్ఏఏడబ్ల్యూను 2027-2028, 2028-2029 మధ్య కాలంలో ప్రవేశపెట్టాల్సి ఉంది. దీనిద్వారా ఐఏఎఫ్ ఎలాంటి అంతరాయం లేకుండా ఆపరేషన్లను కొనసాగించే కార్యచరణ సామర్థ్యం ఖచ్చితంగా మెరుగుపడుతుంది. దేశ రక్షణ రంగ సన్నద్ధతను ఇది బలోపేతం చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2314207)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6