ప్రధాన మంత్రి కార్యాలయం
ఆయుష్మాన్ భారత్ ఎనిమిదో వార్షికోత్సవం.. పథకం విజయవంతంగా అమలవుతోందన్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 SEP 2026 11:35AM by PIB Hyderabad
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం మొదలై ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, ఈ పథకం సాధించిన విజయాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.
భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఉన్నత నాణ్యత కలిగిన ఆరోగ్యసంరక్షణ సేవలను తక్కువ ఖర్చులో అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఈ పథకాన్ని ఎనిమిది సంవత్సరాల కిందట ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం 6 కోట్ల కన్న ఎక్కువ మంది లబ్ధిదారులకు ఏటా రూ.5 లక్షల విలువైన ఆరోగ్య బీమా రక్షణ అందుతోందనీ, ఈ పథకం ప్రపంచంలో అతి పెద్ద ఆరోగ్యసంరక్షణ పథకంగా నిలిచిందనీ ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం వైద్య ఖర్చుల్లో రికార్డు స్థాయి ఆదాకు తోడ్పడిందనీ, దీంతో పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతోందనీ శ్రీ మోదీ అన్నారు.
ఆరోగ్యసంరక్షణ సేవలు ఇంటింటికీ చేరుతున్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రజలు ఇంతవరకు 500 కోట్ల కన్న ఎక్కువ సార్లు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు వెళ్లారనీ, ఫలితంగా క్షేత్ర స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలు బలోపేతం అవుతున్నాయనీ ఆయన వివరించారు. ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘దేశంలో ప్రతి ఒక్కరికీ ఉన్నతమైన నాణ్యతతో కూడిన ఆరోగ్యసంరక్షణ సేవలను తక్కువ ఖర్చులో అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎనిమిది సంవత్సరాల కిందట ప్రారంభించారు.
ఇవాళ, రూ.5 లక్షల వార్షిక ఆరోగ్య రక్షణ ప్రయోజనాలను 60 కోట్ల కన్న ఎక్కువ మంది లబ్ధిదారులు అందుకొంటున్నారు. దీంతో, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్యసంరక్షణ సేవల పథకంగా రూపొందింది.
అంతేకాదు.. ఈ పథకం వైద్య ఖర్చుల్లో రికార్డు స్థాయి ఆదాకు దోహదం చేసింది. ఫలితంగా పేదలతో పాటు మధ్య తరగతి ప్రజలకు కూడా మేలు కలిగింది.
ఆరోగ్య సేవలు ప్రతి ఇంటి ముంగిటకూ చేరువవుతున్నాయి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు ప్రజలు ఇప్పటి వరకూ 500 కోట్ల కన్న ఎక్కువ సార్లు వెళ్లారు. ఈ పథకంతో క్షేత్ర స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలు పటిష్ఠమవుతున్నాయి.
ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులందరికీ నేను మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2313794)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam