ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గౌరవ షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 21 SEP 2026 7:12PM by PIB Hyderabad

గౌరవ షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దుబాయ్ రాజ కుటుంబానికి, అక్కడి ప్రజలకు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తూ... సమాజ సేవలో షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కృషిని భావి తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయని శ్రీ మోదీ పేర్కొన్నారు.

‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

గౌరవ షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. సమాజ సేవలో ఆయన కృషిని భావి తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి.

రాజ కుటుంబానికి, దుబాయ్ ప్రజలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

@HHShkMohd


(రిలీజ్ ఐడి: 2313249) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Tamil , Malayalam