వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లంచం ఫిర్యాదుపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర ఆగ్రహం.. అధికారి సస్పెన్షన్

నాడు పోస్టు చేయడమైనది: 21 SEP 2026 4:51PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలోని ఇద్దరు గిడ్డంగుల యజమానుల నుంచి లంచం డిమాండు చేశారంటూ మార్కెటింగ్  అధికారిపై నమోదైన ఫిర్యాదుపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా స్పందించారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖలో మార్కెటింగ్ అధికారిగా పనిచేస్తున్న అనురాగ్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

ఫిర్యాదు ప్రకారం.. సీహోర్ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా రాయితీ నిధులను విడుదల చేయడానికి సంబంధిత అధికారి డబ్బులు డిమాండు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. భైరుందా తహసీల్‌లోని శివాయ్ గిడ్డంగి నుంచి రూ.1 లక్ష, రెహ్తీ ప్రాంతంలోని బెహరాఖేడీ గ్రామంలోని శ్రీ కృష్ణ గిడ్డంగి నుంచి రూ.60,000 లంచం డిమాండు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఫిర్యాదు కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వచ్చింది. ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కేంద్రమంత్రి.. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు మార్కెటింగ్ అధికారి అనురాగ్‌ను తక్షణమే సస్పెండ్ చేశారు. రైతులు, గిడ్డంగుల నిర్వాహకులకు సంబంధించిన ప్రభుత్వ ప్రక్రియల్లో అవకతవకలు లేదా లంచం గురించి వచ్చే ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2313245) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Odia , Tamil