ప్రధాన మంత్రి కార్యాలయం
ధర్మం, విద్య, అహింస అన్న మూడు సుగుణాలూ ముఖ్యమంటున్న సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2026 11:31AM by PIB Hyderabad
ధర్మం, విద్య, అహింస అన్న మూడు సద్గుణాల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
‘‘ఏకో ధర్మః పరం శ్రేయః క్షమైకా శాన్తిరుత్తమా
విద్యైకా పరమా తృప్తిరహింసైకా సుఖావహా’’ అన్న ఓ సంస్కృత సుభాషితాన్ని ఆయన ప్రస్తావించారు.
ధర్మం పరమ మంచితనం వైపునకు తీసుకుపోతుంది. క్షమ అత్యున్నత స్థాయి మనశ్శాంతిని అందిస్తుంది. విద్య పరమ సంతృప్తిని కలిగిస్తుంది. అహింషే నిజమైన సంతోషానికి మూలమనే సందేశాన్ని ఈ సుభాషితం మనకు ఇస్తోంది.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ
‘‘ఏకో ధర్మః పరం శ్రేయః క్షమైకా శాన్తిరుత్తమా
విద్యైకా పరమా తృప్తిరహింసైకా సుఖావహా’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2312932)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam