ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల మహిళల షూటింగ్‌లో రజత పతక విజేత ఎళావెనిల్ వాళరివన్‌కు ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 20 SEP 2026 5:00PM by PIB Hyderabad

   సియా క్రీడల్లో మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రజత పతకం సాధించిన భారత షూటర్‌ ఎళావెనిల్‌ వాళరివన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. మన షూటర్లు అంతర్జాతీయ వేదికలపై సదా భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“భారత షూటర్ల ప్రతిభ దేశ ప్రజలందరికీ ఆనందదాయకం! ఆసియా క్రీడల్లో మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న ఎళావెనిల్‌ వాళరివన్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఇది ఇవాళ ఆమె వరుసగా రెండో పతకం కైవసం చేసుకోవడం మనకెంతో ప్రత్యేకం. భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. PM @narendramodi

***


(రిలీజ్ ఐడి: 2312838) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam