ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
1945 నాటి ఔషధ నియమావళికి సవరణలను ప్రతిపాదించిన కేంద్ర ఆరోగ్య శాఖ
షెడ్యూల్ హెచ్, హెచ్1, ఎక్స్ ఔషధాల నియంత్రణ సంబంధిత పొరపాట్లను సరిదిద్దడమే లక్ష్యం
పారదర్శకతను, జవాబుదారుతనాన్ని పెంచడానికి
మందుల షాపుల్లో సీసీటీవీల నిఘా తప్పనిసరి చేసే ప్రతిపాదన
నాడు పోస్టు చేయడమైనది:
17 SEP 2026 9:37AM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, 1945 నాటి ఔషధ నియమావళికి సవరణలను ప్రతిపాదించింది. 2026 సెప్టెంబర్ 8వ తేదీతో వెలువరించిన ముసాయిదా రాజపత్రం అధికార ప్రకటన జి.ఎస్.ఆర్. 791 (ఇ) ద్వారా ఈ సంగతిని తెలిపింది. షెడ్యూలు హెచ్, హెచ్1, ఎక్స్ మందుల విషయంలో నియంత్రణ పూర్వక పొరపాట్లను సరిదిద్ది పటిష్టపరిచే ఉద్దేశంతో ఈ చర్యను తీసుకున్నారు.
షెడ్యూలు హెచ్, హెచ్1, ఎక్స్ మందుల అమ్మకానికి, అధికారిక ఉపయోగానికి సంబంధించిన ఆందోళనలను ప్రతిపాదిత సవరణ పరిష్కరించ దలుస్తోంది. అంతేకాదు, నియంత్రణకు సంబంధించిన మరో రక్షణ చర్యలో భాగంగా.. మందుల దుకాణాల్లో క్లోజ్‌డ్-సర్క్యూట్ టెలివిజన్ (సీసీటీవీ)తో నిఘాను ఉంచాలని కూడా ఈ సవరణలో సిఫార్సు చేశారు.
ఈ ప్రతిపాదనను మొదట డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ)లో చర్చించారు. తరువాత దీనిని మరిన్ని సంప్రదింపుల కోసం డ్రగ్స్ టెక్నికల్ అడ్వయిజరీ బోర్డ్ (డీటీఏబీ) సభ్యులకు అందించారు. డీటీఏబీ ఈ ప్రతిపాదనను పరిశీలించి, తాను దీనిని ఆమోదించవచ్చంటూ సిఫార్సు చేసింది.
ప్రతిపాదిత సవరణ అమలులోకి వస్తే, షెడ్యూల్ హెచ్, హెచ్1, ఎక్స్ ఔషధాల విక్రయం, పంపిణీ ప్రక్రియలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని, ఆ మందుల అనధికార లభ్యతను, సరి అయిన మందుల చీటీలు లేకపోయినా ఆ ఔషధాలను అమ్మడాన్ని అడ్డుకోగలదని భావిస్తున్నారు.
ప్రతిపాదిత సీసీటీవీ నిఘా వ్యవస్థ ఔషధాల సరఫరా వ్యవస్థ అంతటా పారదర్శకత్వాన్ని, జవాబుదారుతనాన్ని ఇప్పటి కన్నా పెంచడంతో పాటు, ప్రజారోగ్య రక్షణను పటిష్ఠపరచడానికి కూడా దోహదం చేయనుంది.
ప్రతిపాదిత సవరణపై ప్రజలు, ఆసక్తిదారులు సూచనలను, సలహాలను, అభ్యంతరాలను తెలియజేయవచ్చని మంత్రిత్వశాఖ కోరింది. అభ్యంతరాలు, సూచనలు ఏవైనా చేయదలుచుకుంటే, వాటిని అండర్ సెక్రటరీ (డ్రగ్స్), ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం, యు-6, వర్క్ హాల్-సీ వింగ్, ఒకటో అంతస్తు, కర్తవ్య భవన్-1, న్యూఢిల్లీ-110001 చిరునామాకు పంపవచ్చు.
ఈమెయిల్ చేయాలనుకొంటే, అందుకోసం drugsdiv-mohfw[at]gov[dot]inను ఉపయోగించవచ్చు.
ఎలక్ట్రానిక్ మాధ్యమంలో రాజపత్రాన్ని చూడటానికి, ఈ కింది లింకు లోకి వెళ్లవచ్చు:
https://egazette.gov.in/(S(ypsv3ntrb4ngmjg0wdnihog4))/ViewPDF.aspx
***
(రిలీజ్ ఐడి: 2311265)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8