ప్రధాన మంత్రి కార్యాలయం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందిన అనంత నాగ్ గారికి ప్రధాని అభినందన
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 6:13PM by PIB Hyderabad
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందిన సందర్భంగా దిగ్గజ నటుడు శ్రీ అనంత నాగ్ గారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అనేక దశాబ్ధాలుగా ఆయన సహజ నటనా చాతుర్యం, అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞ, కళాత్మక ప్రతిభ భారతీయ సినిమాపై, ముఖ్యంగా కన్నడ సినిమాపై చెరగని ముద్ర వేశాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ గౌరవానికి శ్రీ అనంత నాగ్ అన్నివిధాలుగా, సంపూర్ణంగా అర్హులని, భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను ఇది ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ విశిష్ట సందర్భంలో ఆ గొప్ప కళాకారుడికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందిన దిగ్గజ నటుడు శ్రీ అనంత నాగ్‌కు అభినందనలు.
అనేక దశాబ్ధాలుగా ఆయన సహజ నటనా చాతుర్యం, అద్భుతమైన బహుముఖ ప్రజ్ఞ, కళాత్మక ప్రతిభ భారతీయ సినిమాపై, ముఖ్యంగా కన్నడ సినిమాపై చెరగని ముద్ర వేశాయి.
ఏ పాత్రను పోషించినా.. అందులో జీవించి దానికి సహజత్వాన్ని తెచ్చారు.
సమున్నతుడైన కళాకారుడికి దక్కిన అత్యంత సముచితమైన గౌరవమిది.’’
(రిలీజ్ ఐడి: 2311148)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7