ప్రధాన మంత్రి కార్యాలయం
సాహసం, జ్ఞానం ముఖ్యమని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 12:54PM by PIB Hyderabad
ధైర్య సాహసాలు, జ్ఞాన గుణాల ప్రాధాన్యాన్ని బోధిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
‘‘అద్వైధమనసం యుక్తం శూరం ధీరం విపశ్చితమ్
న శ్రీః సన్త్యజతే నిత్యమాదిత్యమివ రశ్మయః’’ అనేదే ఆ సుభాషితం.
‘సాహసవంతులు, స్థిర చిత్తులు, వివేక వంతులు, శక్తి మంతుల సరసనే సమృద్ధి సదా నిలిచివుంటుంది.. సరిగ్గా కిరణాలు ఎల్లప్పుడూ సూర్యునితో జతపడిఉన్నట్లుగానే’ అని ఈ సుభాషితం మనకు తెలియజెబుతోంది.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘అద్వైధమనసం యుక్తం శూరం ధీరం విపశ్చితమ్
న శ్రీః సన్త్యజతే నిత్యమాదిత్యమివ రశ్మయః’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2310945)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam