పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గాంధీనగర్‌లో ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరం (డబ్ల్యూసీఈఎఫ్) 2026ను ప్రారంభించిన కేంద్ర పర్యావరణశాఖ మంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి

ప్రపంచం కోసం ఆచరణాత్మక సర్క్యులర్ పరిష్కారాలను అభివృద్ధి చేస్తూ వసుధైక కుటుంబం స్ఫూర్తిని డబ్ల్యూసీఈఎఫ్ 2026 ప్రతిబింబించాలి: గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్

మార్చడానికి ముందు మరమ్మతులు, పారేయడం కంటే పునర్వినియోగం, వ్యర్థాలుగా మార్చడం కంటే పునరుద్ధరణకు ప్రాధాన్యం అన్న మన సంప్రదాయాల్లోనే భారతీయ జీవన విధానం: శ్రీ

భూపేందర్ యాదవ్

సర్క్యులర్ ఆర్థిక విధానానికి సహకారమే కీలకం: జ్ఞానం, సాంకేతికత, ఆర్థిక వనరులు, బాధ్యతలు సరిహద్దులు, రంగాలను దాటి పంచుకోవాలి: కేంద్ర పర్యావరణశాఖ మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 SEP 2026 12:20PM by PIB Hyderabad

గుజరాత్ సీఎం శ్రీ భూపేంద్రభాయ్ పటేల్‌తో కలిసి కేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పులశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ గాంధీనగర్‌లో నేడు ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరం (డబ్ల్యూసీఈఎఫ్) 2026ను ప్రారంభించారు. ‘ప్రజలుసమృద్ధి కోసం సర్క్యులర్ ఎకానమీపరివర్తన’ అనే ప్రధానాంశంతో సెప్టెంబర్15 నుంచి 18 వరకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారుప్రారంభ కార్యక్రమంలో గుజరాత్‌ అటవీపర్యావరణవాతావరణ మార్పులశాఖ మంత్రి అర్జున్‌భాయ్‌ మోధ్వాడియాగుజరాత్‌ అటవీపర్యావరణవాతావరణ మార్పులశాఖ సహాయ మంత్రి ప్రవీణ్‌భాయ్‌ మాలిభారత్‌లోని ఫిన్లాండ్‌ రాయబారి మిక్కో కివికోస్కీనెదర్లాండ్స్‌ ఆర్థిక వ్యవహారాలువాతావరణశాఖ సర్క్యులర్‌ ఎకానమీ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ మారికే స్పైకర్‌బోయర్‌సిట్రా అధ్యక్షుడు అట్టే జెస్కెలైనెన్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంగుజరాత్‌ ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ ప్రసంగిస్తూ.. దక్షిణాసియాలో డబ్ల్యూసీఈఎఫ్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి అనీఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతతో ప్రపంచ స్థాయిలో భారత్ ఎదుగుతున్న నాయకత్వానికి నిదర్శనమని చెప్పారుప్రపంచ సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థకు మిషన్ లైఫ్ బలమైన ఆధారంగా మారుతోందనిఈ వేదిక ప్రపంచానికి ఉపయోగపడే ఆచరణాత్మక సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ పద్ధతులను ప్రదర్శిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

అభివృద్ధిపర్యావరణానికి మధ్య సమతుల్యతను పాటిస్తూ పర్యావరణ పరిరక్షణ దిశగా సాగుతున్న గుజరాత్ ప్రయాణాన్ని ముఖ్యమంత్రి వివరించారుసంప్రదాయ సర్క్యులర్‌ విధానాలను ప్రస్తావిస్తూ.. సోమనాథ్‌ ఆలయంలో భక్తులు సమర్పించే కానుకలను పునర్వినియోగ వనరులుగా మార్చిస్థానిక ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉదాహరణను ఆయన పేర్కొన్నారుపునర్వినియోగ సంస్కృతివ్యర్థాలను సంపదగా మార్చే ఆలోచన భారతీయ సంప్రదాయాల్లో ఎప్పటినుంచో భాగంగా ఉన్నాయని తెలిపారుప్రపంచం కోసం ఆచరణాత్మక సర్క్యులర్‌ పరిష్కారాలను అభివృద్ధి చేస్తూ డబ్ల్యూసీఈఎఫ్ ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తిని ప్రతిబింబించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

భారత్‌కు సర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థ అనేది “కొత్త గమ్యం కాదు.. పాత జ్ఞానాన్ని కొత్త కోణంలో చూసే విధానం” అని కేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పులశాఖ మంత్రి శ్రీ భూపేందర్‌ యాదవ్‌ అన్నారుపునర్వినియోగంమరమ్మతులు చేయడంవనరులను గౌరవించడం వంటి సూత్రాలు దేశ సామాజికసాంస్కృతిక జీవన విధానంలో లోతుగా పాతుకుపోయాయని తెలిపారు. ‘‘విధానపరమైన భాషలో ఇప్పుడు ‘సర్క్యులారిటీ’గా పిలుస్తున్న అంశాలుఒకప్పుడు భారతీయుల రోజువారీ జీవితంలో సాధారణ ఆలోచనలుగా ఉండేవికొత్త వస్తువు కొనడం కంటే మరమ్మతులు చేయడంపారేయడం కంటే పునర్వినియోగించడంవ్యర్థాలుగా మార్చడం కంటే వాటి నుంచి ఉపయోగకరమైన వనరులను తిరిగి పొందడం భారతీయ సంప్రదాయాల్లో భాగం’’ అని వివరించారుఅభివృద్ధిపర్యావరణ పరిరక్షణ మధ్య ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదనిఅభివృద్ధిని మరింత సమర్థవంతంగా వనరులను వినియోగించేలాస్థిరంగాసవాళ్లను తట్టుకునేలా మార్చుకునే అవకాశం మన ముందుందని మంత్రి పేర్కొన్నారు. “సర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థ నిజమైన విజయాన్ని మనం ఎంత వ్యర్థాన్ని రీసైకిల్‌ చేశామనే దానితో కాకుండాఎంత తక్కువ విలువను వృథా కాకుండా కాపాడగలిగామనే దానితో కొలవాలి” అని ఆయన అన్నారుసర్క్యులర్‌ భవిష్యత్తు కోసం డబ్ల్యూసీఎఫ్ 2026 భాగస్వామ్యాలనుపరిష్కారాలను రూపొందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో నియంత్రణ సంస్కరణలుడిజిటల్ నిబంధనల అమలు వ్యవస్థల ద్వారా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ పయనిస్తోందని కేంద్రం మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పేర్కొన్నారుఇందులో భాగంగా వివిధ రంగాల వ్యర్థాల నిర్వహణ నిబంధనలను బలోపేతం చేయడంతో పాటు విస్తరించిన ఉత్పత్తిదారుల బాధ్యత (ఈపీఆర్విధానాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలు ఉన్నట్లు తెలిపారు. ‘‘ ఒక ఉత్పత్తి ప్రయాణానికి వ్యర్థం ముగింపు దశగా కాకుండామరొ వనరుల చక్రానికి ప్రారంభంగా కనిపించాలి’’ అనేదే ముఖ్య ఉద్దేశమని చెప్పారుఆగస్టు 2026 నాటికి వివిధ ఈపీఆర్ విధానాల కింద 83,000 కంటే ఎక్కువ మంది తయారీదారులు, 4,802 మంది రీసైకిలర్లు నమోదు చేసుకున్నారని తెలిపారునియంత్రణ పరిధిలోని వివిధ రకాల వ్యర్థాల్లో దాదాపు 482.24 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను శుద్ధి చేసినట్లు ఆయన వెల్లడించారు.

కేవలం నిబంధనలు రూపొందించడం ద్వారా మాత్రమే సర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థను సాధించలేమని కేంద్ర పర్యావరణ, అటవీవాతావరణ మార్పులశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ స్పష్టం చేశారుప్రజలు వస్తువులను ఎలా వినియోగిస్తారనే అంశం నుంచే సర్క్యులర్‌ విధానం ప్రారంభం కావాలని అన్నారుపర్యావరణం కోసం జీవనశైలి కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. సర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థ కేవలం రీసైక్లింగ్‌ కేంద్రాల వద్ద ప్రారంభం కాదనిమార్కెట్‌లో వస్తువుల కొనుగోలువినియోగం నుంచే మొదలైఇళ్లలో కొనసాగిచివరకు రోజువారీ జీవితంలో ఒక అలవాటుగా మారాలని వివరించారుసర్క్యులర్‌ ఆర్థిక విధానం సహజంగానే సహకారంతో కూడుకున్నదని పేర్కొన్న మంత్రి.. ఏ దేశంసంస్థ లేదా ప్రజలు ఒంటరిగా వనరుల చక్రాన్ని పూర్తిచేయలేవని అన్నారుజ్ఞానంసాంకేతికతఆర్థిక వనరులుబాధ్యతలు దేశాల సరిహద్దులువివిధ రంగాలను దాటి విస్తరించాల్సిన అసరం ఉందని పేర్కొన్నారుసర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థ విషయంలో భారత్‌ అందిస్తున్న అంతర్జాతీయ సహకారాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌ జీ20 అధ్యక్షత సమయంలో ప్రారంభించిన వనరుల సమర్థ వినియోగంసర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థ పరిశ్రమల కూటమిని (ఆర్ఈసీఈఐసీఉదాహరణగా పేర్కొన్నారుసుస్థిర జీవనశైలిపర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణవాతావరణ మార్పులకు అనుగుణంగా మారడం వంటి అంశాలతో పాటు సర్క్యులర్‌ ఆర్థిక విధానాన్ని కూడా పరస్పరం అనుసంధానమైన ప్రాధాన్య అంశంగా భారత్‌ బ్రిక్స్‌ అధ్యక్షతలో చేర్చిందని మంత్రి తెలిపారు.

 

గుజరాత్‌ అటవీపర్యావరణశాఖ మంత్రి అర్జున్‌భాయ్‌ మోధ్వాడియా మాట్లాడుతూ.. భూమి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చగలదు కానీ ప్రతి ఒక్కరి అత్యాశను తీర్చలేదంటూ మహాత్మాగాంధీ చెప్పిన సందేశాన్ని గుర్తుచేశారుప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్‌లో సర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్తకు పునాది వేశారనిప్రస్తుతం ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్‌ పటేల్‌ నాయకత్వంలో ఆ దిశగా మరింత పురోగతి సాధిస్తూ గుజరాత్‌ రాష్ట్రాన్ని సర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థ పరివర్తనకు ప్రపంచ కేంద్రంగా నిలిపే దిశగా కృషి జరుగుతోందని అన్నారువ్యర్థాలను వనరులుగావనరులను విలువగా మార్చడం ద్వారా సుస్థిరమైనసవాళ్లను తట్టుకునే భవిష్యత్తును నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఫిన్లాండ్‌ రాయబారి మిక్కో కివికోస్కీ మాట్లాడుతూ.. సర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థ ప్రత్యేక పర్యావరణ కార్యక్రమం కాదనిఅభివృద్ధికి సంబంధించిన ప్రాథమిక ఆలోచనా విధానమని అన్నారుఇది ఫిన్లాండ్‌ జాతీయ విధానంలో అంతర్భాగంగా మారిందని తెలిపారు. 2035 నాటికి వనరుల వినియోగాన్ని 2015 స్థాయి కంటే తక్కువకు తీసుకురావాలన్న ఫిన్లాండ్‌ లక్ష్యాన్ని ఆయన ప్రస్తావించారుభారత్‌లో పనిచేస్తున్న 100కు పైగా ఫిన్లాండ్‌ కంపెనీలు సుస్థిర సాంకేతికతలుసర్క్యులర్‌ విధానాలతో ముందుకెళుతున్నాయని పేర్కొన్నారుఏ వస్తువులను ఉత్పత్తి చేయాలివాటి విలువను సాధ్యమైనంత ఎక్కువ కాలం ఎలా కొనసాగించాలనే అంశాలపై పునరాలోచించడం ద్వారా సర్క్యులర్‌ విధానాన్ని ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభ దశ నుంచే అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. “అసలు ఉత్పత్తి కాని వ్యర్థమే అత్యుత్తమ వ్యర్థం” అని పేర్కొన్నారుడిజిటలైజేషన్సుస్థిరతపై దృష్టి పెడుతూ.. భారత్‌-ఫిన్లాండ్‌ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచినట్లు తెలిపారు.

 

నెదర్లాండ్స్‌ ఆర్థిక వ్యవహారాలువాతావరణ శాఖ సర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ మారికే స్పైకర్‌బోయర్‌ మాట్లాడుతూ.. సర్క్యులర్‌ ఆర్థిక విధానం నెదర్లాండ్స్‌ పారిశ్రామిక విధానంలో అంతర్భాగమని అన్నారు. 2050 నాటికి పూర్తిస్థాయి సర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యంతో ఆ దేశం పనిచేస్తోందని తెలిపారుపదార్థాల వినియోగాన్ని తగ్గించడంలో సాధించిన పురోగతినిసర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థ చట్టంఈపీఆర్ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలను ఆమె వివరించారుసర్క్యులర్‌ విలువ వ్యవస్థలను నిర్మించేందుకు అంతర్జాతీయ సహకారం ఎంతో అవసరమని స్పష్టం చేశారుడబ్ల్యూసీఈఎఫ్ 2026లో 20కి పైగా డచ్ కంపెనీలుసంస్థలు పాల్గొంటున్న విషయాన్ని వెల్లడిస్తూ.. పెద్ద కంపెనీలతో పాటు అంకుర సంస్థల్లోనూ సర్క్యులర్‌ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భారత్‌ చూపుతున్న ఉత్సాహాన్నిఆశయాన్ని ఆమె ప్రశంసించారు.

ప్రపంచ సర్క్యులర్‌ ఎకానమీ ఫోరం (డబ్ల్యూసీఈఎఫ్) 2026 ప్రాంగణంలో 135 జాతీయఅంతర్జాతీయ ప్రదర్శనకారులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రముఖులు ప్రారంభించిపరిశీలించారుఇందులో సర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఆచరణాత్మక పరిష్కారాలను చూపించారుఈ వేదికలో 62 దేశాల నుంచి వ్యాపారవేత్తలుఆవిష్కర్తలుపరిశోధకులువిధాన నిర్ణేతలువిద్యావేత్తలతో సహా 3600 మందికి పైగా వివిధ రంగాల భాగస్వాములు పాల్గొన్నారుప్రారంభ కార్యక్రమంలో రెండు ప్రచురణలను (‘శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగానికి ఉత్తమ పద్ధతులు’, ‘సుస్థిరత దిశగా అడుగులు-భారత సర్క్యులర్‌ ఆర్థిక వ్యవస్థఈపీఆర్ కార్యక్రమాలకు మార్గదర్శి’కూడా ప్రముఖులు విడుదల చేశారు.

 

ఈ కార్యక్రమాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), ఫిన్‌లాండ్‌కు చెందిన ది ఫిన్నిష్ ఇన్నోవేషన్ ఫండ్ సిట్రాఫిన్లాండ్ ప్రభుత్వంకేంద్ర పర్యావరణఅటవీవాతావరణ మార్పుల మంత్రిత్వశాఖగుజరాత్ ప్రభుత్వంగుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి (జీపీసీబీసంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2310762) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Malayalam