విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేపాల్‌కు విద్యుత్‌ ఎగుమతికి అనుమతి

నాడు పోస్టు చేయడమైనది: 14 SEP 2026 1:38PM by PIB Hyderabad

నేపాల్‌ విద్యుత్‌ సంస్థకు రోజుకు 18 గంటల పాటు (00:00 గంటల నుంచి 18:00 గంటల వరకు) విద్యుత్‌ ఎగుమతి చేసేందుకు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ అనుమతి 2026 సెప్టెంబర్‌ 13 నుంచి డిసెంబర్‌ 31 వరకు అమల్లో ఉంటుంది.

ముజఫర్‌పూర్‌ ఢల్కేబర్‌ 400 కేవీ డబుల్‌ సర్క్యూట్‌  లైన్‌ ద్వారా గరిష్ఠంగా 600 మెగావాట్లు, తనక్‌పూర్‌ - మహేంద్రనగర్‌ 132 కేవీ సింగిల్‌ సర్క్యూట్‌ లైన్‌ ద్వారా గరిష్ఠంగా 54 మెగావాట్ల విద్యుత్‌ ఎగుమతికి అనుమతి ఇచ్చారు. 2027 జనవరి నుంచి ఎగుమతి చేయాల్సిన విద్యుత్‌ పరిమాణంపై 2026 డిసెంబర్‌లో సమీక్ష నిర్వహించనున్నారు.

ఇటీవల సంభవించిన వరదల కారణంగా నేపాల్‌లో జలవిద్యుత్‌ మౌలిక సదుపాయాలకు భారీగా నష్టం వాటిల్లింది. దీంతో దేశీయ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం తగ్గడంతో పాటు, అదనంగా విద్యుత్‌ అవసరం ఏర్పడింది. ఈ అనుమతితో క్లిష్ట పరిస్థితుల్లో నేపాల్‌ విద్యుత్‌ అవసరాలను తీర్చుకోవడానికి వీలు కలుగుతుంది. భారత్‌ - నేపాల్‌ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సన్నిహిత ఇంధన సహకారం మరింత బలోపేతం కావడానికి కూడా ఇది దోహదపడుతుంది.

నేపాల్‌కు అండగా నిలవడంతో పాటు ఇరు దేశాల మధ్య ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూడా భారత్‌ కట్టుబడి ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2310214) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Tamil , Kannada , Malayalam