వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మెట్ట వ్యవసాయ భూములపై ఢిల్లీ ప్రకటన ఆమోదంతో ముగిసిన డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026

మెట్ట వ్యవసాయ భూముల పరివర్తనకు విజ్ఞానం, ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు అవసరమని పిలుపునిస్తూ ముగిసిన మూడు రోజుల సదస్సు

దృఢమైన మెట్ట భూముల వ్యవసాయ- ఆహార వ్యవస్థల నిర్మాణానికి బలమైన డేటా వ్యవస్థలు, ప్రయోగశాలలు కీలకం: డీఏఆర్‌ఈ కార్యదర్శి డాక్టర్ ఎంఎల్ జాట్‌

నాడు పోస్టు చేయడమైనది: 13 SEP 2026 9:07AM by PIB Hyderabad

మూడు రోజులపాటు సాగిన డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 (మెట్ట వ్యవసాయ భూముల సదస్సునేడు న్యూఢిల్లీలో ముగిసిందిమెట్ట వ్యవసాయానికి అవసరమైన పరిష్కారాలను వేగవంతం చేసేందుకు బలమైన దక్షిణదక్షిణ సహకారంత్రైపాక్షిక సహకారరాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సదస్సు పిలుపునిచ్చిందిముగింపు రోజు ఐక్యరాజ్యసమితి దక్షిణదక్షిణ సహకార దినోత్సవం కూడా కలిసిరావడం విశేషంఈ సందర్భంగా మెట్ట భూములపై ఢిల్లీ ప్రకటనను (3డీఆమోదించారుఅభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరస్పర సహకారంసమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంఆవిష్కరణలుసమష్టి కార్యాచరణ ద్వారా మెట్ట వ్యవసాయ భూముల రూపురేఖలను మార్చేందుకు ఒక ఉమ్మడి అజెండాను ఇది నిర్దేశించిందిశుష్క భూభాగాల సదస్సు 2026 ముగింపు ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వాలుసంస్థలుభాగస్వాములుప్రతినిధులు ఈ  ప్రకటనకు ఆమోదం తెలిపారు.

 

ముగింపు సమావేశంలో డీఏఆర్‌ఈ కార్యదర్శిఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎంఎల్ జాట్‌ ప్రసంగిస్తూ.. మెట్ట వ్యవసాయం కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ముందస్తు ఆలోచనలుభవిష్యత్తు‌ దృక్పథాన్ని ప్రధాన అంశంగా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారుఇందుకోసం పటిష్టమైన సంస్థాగత వ్యవస్థ అవసరమని పేర్కొన్నారుమెట్ట వ్యవసాయంపై భవిష్యత్తు‌ దృక్పథానికి సంబంధించిన కార్యక్రమాలకు నాయకత్వం వహించే బాధ్యతను ఐసీఏఆర్‌-జాతీయ వ్యవసాయ ఆర్థిక శాస్త్రంవిధాన పరిశోధన సంస్థ (ఐసీఏఆర్‌-ఎన్‌ఐఏపీ)కు అప్పగించాలని సూచించారుమెట్ట వ్యవసాయ-ఆహార వ్యవస్థలకు పటిష్టమైన డేటాసమాచార వ్యవస్థల అవసరాన్ని తెలియజేశారుపరిశోధనను క్షేత్రస్థాయి ఆచరణవిధానాలతో అనుసంధానించే ఉమ్మడి ఆవిష్కరణ వేదికలుసజీవ ప్రయోగశాలలు అవసరమని తెలిపారు.

 

ఐసీఆర్‌ఐఎస్‌ఏటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌ మాట్లాడుతూ.. ప్రపంచ ఆహార భద్రతకు మెట్ట భూములు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని పేర్కొన్నారుగత మూడు రోజులుగా జరిగిన చర్చలను స్పష్టమైన కార్యాచరణగా మార్చాలని పిలుపునిచ్చారుచర్చల సారాంశాన్ని రూపొందించివాటిని స్వల్పకాలికదీర్ఘకాలిక చర్యలకు ప్రాధాన్యతా క్రమంలో విభజించాలని సూచించారునైపుణ్యంజ్ఞానంస్నేహపూర్వక సహకారాన్ని ఒకచోట చేర్చి ఆలోచనల నుంచి భావనలకుభావనల నుంచి స్పష్టమైన కార్యాచరణఅమలుకు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

 

చివరి రోజు సమావేశంలో మొత్తం సదస్సు ద్వారా ఏర్పడిన కొత్త భాగస్వామ్యాలుసహకారాలు కూడా ప్రస్తావనకు వచ్చాయిగ్లోబల్ క్రాప్ డైవర్సిటీ ట్రస్టుతో కొత్త ఒప్పందాలుఅవగాహనా ఒప్పందాలు కుదిరినట్లు ప్రకటించారుమెట్ట వ్యవసాయంలో ఆవిష్కరణలుకార్యాచరణకు మరింత మద్దతిచ్చేలా ఏవియర్ లైఫ్ సైన్సెస్నిఫ్టెమ్విప్రోఒడిశాలోని అంగుల్రాయగడ జిల్లా పాలనా యంత్రాంగాలతో ఇక్రిశాట్‌ సంస్థ అవగాహన ఒప్పందాలను పరస్పరం మార్చుకుందిమూడు రోజుల చర్చల సారాంశాన్ని సమర్పించిసదస్సు నుంచి వెలువడిన కీలక ఫలితాలుసిఫార్సులను సదస్సు సహ అధ్యక్షులు ఐసీఏఆర్‌ పంటల శాస్త్ర విభాగం డీడీజీ డాక్టర్‌ డీకే యాదవ్‌ఇక్రిశాట్‌ పరిశోధనఆవిష్కరణల విభాగం డీడీజీ డాక్టర్‌ స్టాన్‌ఫోర్డ్ బ్లేడ్‌ వివరించారు. 

 

ఐక్యరాజ్యసమితి దక్షిణ-దక్షిణ సహకార దినోత్సవ స్మారక వేడుకతో అంతకముందు రోజు వేడుక ప్రారంభమైందిఇందులో ఐరాస ప్రధాన కార్యదర్శిఎఫ్‌ఎఓ డైరెక్టర్ జనరల్యుఎన్‌ఓఎస్‌ఎస్‌సీ డైరెక్టర్ శ్రీమతి దిమా అల్-ఖతీబ్‌ సందేశాలను వినిపించారువ్యవసాయంలో దక్షిణాది-దక్షిణాది సహకారం కోసం అంతర్జాతీయ సంఘీభావం (ఐఎస్‌ఎస్‌సీకార్యాచరణ దృక్పథాన్ని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ పంచుకున్నారుఅభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య భాగస్వామ్యాలను బలపరచడం కీలకమని చెప్పారుమరింత మెరుగైన ఫలితాల కోసం దక్షిణదక్షిణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇక్రిశాట్ఐసీఏఆర్సీజీఐఏఆర్ఆర్‌ఐఎస్నాబార్డ్సీజీఐఏఆర్‌కెపాసిటీ షేరింగ్ యాక్సిలరేటర్ ప్రతినిధులు తమ నిబద్ధతలను ప్రకటించారు. 

అనంతరం సీజీఐఏఆర్‌ సహకారంతో సరిహద్దులు లేని జ్ఞానందక్షిణదక్షిణత్రైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం” అనే అంశంపై ప్రత్యేక సమావేశం జరిగిందిదక్షిణదక్షిణత్రైపాక్షిక సహకారాన్ని మరింత సమర్థవంతంగా మార్చడంవిజయవంతమైన నమూనాలను విస్తృత స్థాయిలో అమలు చేయడం వంటి అంశాలపై నిపుణుల స్థాయిలో రెండు చర్చలు జరిగాయిఇథియోపియాసెనెగల్‌బ్రెజిల్‌చైనాభారత్‌ల జాతీయ వ్యవసాయ పరిశోధనా వ్యవస్థలకు చెందిన వక్తలుసీజీఐఏఆర్‌ఎఫ్‌ఏఆర్‌ఏఏపీఏఏఆర్‌ఐ ప్రతినిధులు కలిసి తమ అనుభవాలనుఅభిప్రాయాలను పంచుకున్నారు.

సదస్సులో భాగంగా ఐఎస్‌ఎస్‌సీఏ ప్రపంచ అవార్డులు 2026 ప్రదానం కూడా జరిగిందిఅభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వివిధ సంస్థలు అభివృద్ధి చేసినవిజయవంతంగా అమలైన వ్యవసాయ ఆవిష్కరణలను గుర్తించివాటిని విస్తృత స్థాయిలో అమలు చేయడానికిఇతర దేశాలకు అనుగుణంగా స్వీకరించడానికి ఉన్న అవకాశాలను ప్రోత్సహించే వార్షిక ప్రతిష్టాత్మక కార్యక్రమమే ఐఎస్‌ఎస్‌సీఏ ప్రపంచ అవార్డులుతొలిసారిగా నిర్వహించిన ఈ అవార్డులకు ఆసియాఆగ్నేయాసియాఆఫ్రికామధ్యప్రాచ్యంలాటిన్ అమెరికాకరేబియన్‌లోని 34 దేశాల నుంచి 170 నామినేషన్లు అందాయి.  టీఏఏటీ గోధుమ కాంపాక్ట్ సాంకేతికతలుఅధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే గోధుమ రకాలు’ కోసం కృషి చేసినందుకు లెబనాన్‌కు చెందిన ఐసీఏఆర్‌డీఏ సంస్థకు ఐఎస్‌ఎస్‌సీఏ గ్లోబల్ అవార్డ్ ఫర్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఎక్సలెన్స్(మెగా అవార్డు)ను-గ్రాలజీ 360  రూపకల్పనకు గాను మెక్సికోకు చెందిన సీఐఎంఎంవైటీ సంస్థకు, ‘పోషకాహారంగ్రామీణ స్థితిస్థాపకత కోసం మహిళల నాయకత్వంలో చేపడుతున్న సుస్థిర వ్యవసాయం’ విభాగంలో భారత్‌లోని ఒడిశా ప్రభుత్వానికి చెందిన ఒడిశా లైవ్‌లీహుడ్స్ మిషన్‌కు ప్రదానం చేశారు.

 

పంటల అభివృద్ధిఉత్పత్తి సాంకేతికతల విభాగంలో బారి చినాబాదం-వేరుశనగ రకానికి గాను బంగ్లాదేశ్‌లోని బంగ్లాదేశ్ వ్యవసాయ పరిశోధనా సంస్థకు (బీఏఆర్‌ఐ)జీపీబీడీ రకానికి గాను భారత్‌లోని ధార్వాడ వ్యవసాయ శాస్త్ర విశ్వవిద్యాలయానికివాతావరణ అనుకూలతక్కువ కాలపరిమితిలోనే పండే శనగకందివేరుశనగ రకాలను అభివృద్ధి చేసినందుకు గాను మయన్మార్‌కు చెందిన వ్యవసాయ పరిశోధనా శాఖకు (డీఏఆర్‌అవార్డులు లభించాయిసహజ వనరుల నిర్వహణవాతావరణ స్థితిస్థాపకత పురస్కారల విభాగంలో కృషి భాగ్య పథకానికి గాను కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖకుసమగ్ర అరటి సూడో-స్టెమ్ (బోదకాండంప్రాసెసింగ్ కోసం మన దేశానికి చెందిన నెక్టార్ సంస్థకుఆహార్-పైన్ ప్రకృతి దృశ్యాలను పునరుద్ధరించినందుకు గాను బీహార్ ప్రభుత్వ వ్యవసాయ శాఖకుడిజిటల్ భూ పునరుద్ధరణ పర్యవేక్షణకు గాను మలావికి చెందిన సస్టైనబుల్ ఫార్మింగ్ సొల్యూషన్స్ సంస్థకు అవార్డులు దక్కాయి.

 

వ్యవసాయ వాణిజ్యంమార్కెట్ వ్యవస్థల విభాగంలో ఈ-కృషక్ వేదిక కోసం పనిచేసిన బంగ్లాదేశ్‌కు చెందిన బీఐఐడీ ఫౌండేషన్‌కుటీఎన్‌ఏయూ-ఎఫ్‌పీఓ అనుసంధాన కార్యక్రమం కోసం తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయానికిపారాబోలిక్ ఆకారపు సోలార్‌ డ్రైయర్‌ రూపకల్పనకు కృషి చేసిన నైజీరియన్ స్టోర్డ్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ ఇని‌స్టిట్యూట్‌కు అవార్డులు లభించాయిడిజిటల్ వ్యవసాయం విభాగంలో ఏపీఎంఐపీ డిజిటల్ వ్యవస్థ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యానవన శాఖకుకృషి ప్రగతి వేదిక కోసం పనిచేసిన గుజరాత్ ప్రభుత్వ వ్యవసాయంరైతు సంక్షేమంసహకార శాఖకు అవార్డులు ప్రదానం చేశారు.           

 

పశుసంపద అభివృద్ధిఉత్పత్తి సాంకేతికతల విభాగంలో అభివృద్ధి చేసిన బొచ్చె (కార్ప్‌చేపల విత్తన వ్యవస్థకు గాను బంగ్లాదేశ్‌లోని వరల్డ్‌ఫిష్ సంస్థకుదేశవాళీ కోళ్ల జాతుల అభివృద్ధి కార్యక్రమం (పీఐసీ-బీఐపీకోసం కెన్యాలోని అంతర్జాతీయ పశుసంపద పరిశోధనా సంస్థకు (ఐఎల్‌ఆర్‌ఐఅవార్డులు లభించాయివీటితో పాటు మెట్ట వ్యవసాయంలో మేలైన పరిశోధనలుఅభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ ప్రతిభను గుర్తిస్తూ విద్యార్థులుపరిశోధక పండితులకు 16 ఉత్తమ పోస్టర్ అవార్డులను ప్రధానం చేశారు.

“దక్షిణ–దక్షిణ సహకారంతో మెట్ట వ్యవసాయాన్ని రూపాంతరం చేయడం” అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సదస్సు.. శాస్త్రీయ జ్ఞానాన్ని కార్యాచరణగా మార్చడంనిరూపితమైన ఆవిష్కరణలను విస్తృత స్థాయిలో అమలు చేయడంఅభివృద్ధి చెందుతున్న దేశాల్లో పటిష్టమైన స్థితిస్థాపకసుస్థిర మెట్ట భూభాగాల వ్యవసాయం కోసం భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాలన్న పునరుద్ధరించిన నిబద్ధతతో ముగిసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2309903) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Kannada