ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రిక్స్ సదస్సు సందర్భంగా న్యూఢిల్లీలో వియత్నాం ప్రధానమంత్రితో సమావేశమైన భారత ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 SEP 2026 12:54PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా వియత్నాం సోషలిస్ట్‌ రిపబ్లిక్ ప్రధానమంత్రి గౌరవ శ్రీ లె మిన్‌ హుంగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

బ్రిక్స్ సదస్సులో భాగస్వామ్య దేశంగా వియత్నాం పాల్గొనటాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. 2026 మే నెలలో వియత్నాం కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీదేశ అధ్యక్షుడు గౌరవ శ్రీ తో లామ్ భారతదేశంలో పర్యటించిన సందర్భంగా ఇరుదేశాల ఉమ్మడి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకున్నాయిఆ పురోగతిని ఈ సమావేశంలో ఇరువురు నేతలు సమీక్షించారుపరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ ప్రాంతీయప్రపంచ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారుఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటానికి నిబద్ధతతో ఉన్నట్లు స్పష్టం చేశారు.

భారత్‌వియత్నాంల మధ్య కాలపరీక్షకు నిలిచిన బలమైన స్నేహబంధం ఉందిఈ బంధం మన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వంపరస్పర నమ్మకంఅవగాహనలపై ఆధారపడి ఉందిభారత్ అమలు చేస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలసీలో వియత్నాం కీలకమైనదిఆగ్నేయాసియాతో భారతదేశ సంబంధాలను విస్తరించటంలో వియత్నాం కీలక భాగస్వామి.

 

***


(రిలీజ్ ఐడి: 2309590) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam