ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇక రుజువులుగా బ్యాంకింగ్ రికార్డులు

అక్టోబరు 1 నుంచి అమల్లోకి బ్యాంకింగ్ రికార్డుల చట్టం (బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ యాక్ట్) - 2026

బ్యాంకింగ్ రికార్డులను సాక్ష్యాధారాలుగా వినియోగించేందుకు అవకాశాన్ని కల్పిస్తూ.. న్యాయపరమైన నిబంధనలను ఆధునికీకరించేలా చట్టానికి రూపకల్పన

న్యాయపరమైన విచారణల్లో బ్యాంకింగ్ రికార్డుల వినియోగాన్ని సులభతరం చేసేలా.. సరళీకృత, ప్రామాణిక ధ్రువీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 11 SEP 2026 2:53PM by PIB Hyderabad

ఆర్థిక వ్యవస్థలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా.. బ్యాంకింగ్ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడానికీవ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడానికీచట్టపరమైననిబంధనా యంత్రాంగాల ఆధునికీకరణకూ ప్రభుత్వం నిరంతరం సంస్కరణలను అమలు చేస్తోందిబ్యాంకింగ్ విధానాలుసాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఈ మార్పులకు అనుగుణంగా బ్యాంకింగ్ రికార్డుల నిర్వహణ చట్టాలను మార్చాల్సిన అవసరం ఏర్పడుతోంది.

రుజువులుగా బ్యాంకింగ్ రికార్డుల చట్టం (బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్)-1891’ స్థానంలో కొత్తగా రూపొందించిన ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్- 2026’ చట్టానికి 2026 ఆగస్టు 13న గౌరవ రాష్ట్రపతి ఆమోదం లభించిందిప్రస్తుత ఆధునిక బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా బ్యాంకింగ్ రికార్డులను సాక్ష్యాలుగా వినియోగించేలా.. ఒక కొత్త విధానానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.

2026 సెప్టెంబర్ 10 నాటి నోటిఫికేషన్ (గెజిట్ నోటిఫికేషన్ లింక్ కింద ఉంది)... ఈ చట్టంలోని నిబంధనలు అమలులోకి వచ్చే తేదీగా 2026 అక్టోబరు 1ని నిర్ణయించింది.

భౌతికఎలక్ట్రానిక్డిజిటల్వర్చువల్క్లౌడ్ ఆధారితఇతర ఆధునిక రూపాల్లో నిర్వహించే బ్యాంకింగ్ రికార్డులకు గుర్తింపునిస్తూ.. సాంకేతిక నిష్పాక్షికత విధానాన్ని ఈ చట్టం అవలంబిస్తుందిఅలాగే చేత్తో చేసినడిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ సంతకాల ద్వారా బ్యాంకింగ్ రికార్డులను సులభంగాప్రామాణికంగా ధ్రువీకరించే వెసులుబాటును కల్పిస్తుంది.

న్యాయ విచారణల్లో బ్యాంకు నేరుగా ఒక పక్షం కానప్పుడు.. బ్యాంకు అధికారులకు సమన్లు పంపే అంశంపై కొత్త చట్టంలో స్పష్టతనిచ్చారుఇకపై అలాంటి సందర్భాల్లో బ్యాంకు అధికారులను పిలవాల్సి వస్తే.. దానికి గల ‘ప్రత్యేక కారణాన్ని’ కోర్టు లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది.

అంతేకాకుండామారుతున్న ఆర్థిక రంగానికి అనుగుణంగా ఈ విధానపరమైన ఏర్పాట్లు ఉండేలా చేయడం లక్ష్యంగా.. నిర్దిష్ట ఆర్థిక రంగ సంస్థలకు లేదా సంస్థావర్గాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను వర్తింపజేయవచ్చు.

సాంకేతిక పురోగతిమారుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా చట్టాలను ఆధునికీకరించడంవాణిజ్య సౌలభ్యాన్ని ప్రోత్సహించడంఆధునిక ప్రభావవంతమైన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం పట్ల ప్రభుత్వ నిరంతర నిబద్ధతను ఈ సంస్కరణలు ప్రతిబింబిస్తాయి.

2026 సెప్టెంబరు 10 నాటి గెజిట్ నోటిఫికేషన్ లింక్:

https://egazette.gov.in/(S(4du1dbsf0xrjj5ut3dnpovun))/ViewPDF.aspx

https://egazette.gov.in/(S(blcfbghvrddn1sxjnyv5hrpw))/ViewPDF.aspx


(రిలీజ్ ఐడి: 2309375) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , English , Marathi , हिन्दी , Gujarati , Tamil , Malayalam