ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌తో సమావేశమైన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 11 SEP 2026 9:29PM by PIB Hyderabad

ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో సమావేశమయ్యారు.

భారత్‌ నాలుగో సారి బ్రిక్స్ అధ్యక్షత వహిస్తున్నందుకు ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. సమకాలీన వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా బహుపాక్షిక సంస్థలను సంస్కరించాల్సిన అవసరాన్ని, బహుళ ధ్రువత్వ ప్రాముఖ్యతను ఇద్దరు నేతలు ప్రధానంగా చెప్పారు. 

కొనసాగుతున్న ఘర్షణలు, నౌకాయాన స్వేచ్ఛ, సుస్థిరాభివృద్ధి, మానవ కేంద్రీకృత కృత్రిమ మేధ, పునరుత్పాదక ఇంధనం విషయంలో పురోగతి, ప్రపంచ ఆహార భద్రతతో సహా వివిధ అంశాలపై వారు చర్చలు జరిపారు.

ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ పదవీకాలం విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని తెలిపారు.


(రిలీజ్ ఐడి: 2309369) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil