ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిబంధనలు పాటించని15 వర్చువల్ డిజిటల్ అసెట్స్ సర్వీస్ ప్రొవైడర్లకు (వీడీయే ఎస్‌పీ) మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్)-2002లోని సెక్షన్ 13 ప్రకారం నోటీసులు జారీ చేసిన ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ – ఇండియా (ఎఫ్ఐయూ–ఐఎన్‌డీ)

నాడు పోస్టు చేయడమైనది: 09 SEP 2026 11:12AM by PIB Hyderabad

నిబంధనలను పాటించని సంస్థలపై చేపట్టిన చర్యల్లో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం–2002 (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 13 ప్రకారం 15 వర్చువల్ డిజిటల్ అసెట్స్ సర్వీసు ప్రొవైడర్లకు (వీడీయే ఎస్‌పీఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్–ఇండియా (ఎఫ్ఐయూ–ఐఎన్‌డీడైరెక్టర్ నోటీసులు జారీ చేశారు.

 

క్రమ సంఖ్య

ట్రేడ్ పేరు

సంస్థ పేరు

1

వీక్స్

వీక్స్ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్

2

బ్లోఫిన్

బీఎల్ఎఫ్ గ్లోబల్ లిమిటెడ్

3

రెజొరెక్స్

రెజొరెక్స్

4

బిట్యూనిక్స్

బిట్యూనిక్స్ ఎల్ఎల్‌సీ

5

డిజిఫినెక్స్

డిజిఫినెక్స్ లిమిటెడ్

6

టూబిట్

హోప్‌ఫుల్ టెక్నాలజీ కో లిమిటెడ్

7

ఎక్స్‌టీ.కామ్

ఎఫ్ఐబీటీసీ లిమిటెడ్ఎక్స్‌టీ టెక్నికల్ పీటీఈ లిమిటెడ్

8

లాటోకెన్

లాట్రేడ్ లిమిటెడ్

9

ఊ ఎక్స్

ఊటెక్ లిమిటెడ్

10

పయోనెక్స్

మార్కెటా ట్రేడింగ్ ఐఎన్‌సీ

11

ఛేంజ్ నౌ

సీహెచ్ఎన్ గ్రూప్ ఎల్ఎల్‌సీ

12

సింపుల్ స్వాప్

సింపుల్ స్వాప్ లిమిటెడ్

13

ఫిక్స్‌డ్ ఫ్లోట్

ఎఫ్ఎఫ్‌జీఎక్స్ గ్రూప్ ఎల్ఎల్‌సీ

14

వైట్‌బిట్

యూఏబీ క్లియర్ వైట్ టెక్నాలజీస్

15

గార్డేరియన్

ఫిన్‌సెవన్ సీజడ్

 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం – 2000లోని సెక్షన్ 79(3)(బీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యంతర మార్గదర్శకాలుడిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్సవరణ నియమాలు–2025లోని 3(1)(డీనియమం ప్రకారం ఎఫ్ఐయూ–ఐఎన్‌డీ డైరెక్టర్ నోడల్ అధికారి హోదాలో పైన పేర్కొన్న సంస్థలకు ప్రజలకు అందుబాటులో ఉన్న అప్లికేషన్/యూఆర్ఎల్‌లను తొలగించమని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారుఈ సంస్థలు భారత్‌లో సంబంధిత పీఎంఎల్ఏ నిబంధనలను పాటించకుండా చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం–2002 నిబంధనల ప్రకారం 2023 మార్చిలో యాంటీ మనీ లాండరింగ్/కౌంటర్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం (ఏఎంఎల్/సీఎఫ్‌టీనియంత్రణల పరిధిలోకి వర్చువల్ డిజిటల్ అసెట్స్ సర్వీస్ ప్రొవైడర్ (వీడీయే ఎస్‌పీలను తీసుకువచ్చారు.

భారతదేశంలో పనిచేస్తున్న వీడీయే ఎస్‌పీలు (స్థానికంగా లేదా విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ), వర్చువల్ డిజిటల్ అసెట్స్ఫియట్ కరెన్సీల మధ్య మార్పిడినీవర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీనీవాటి భద్రతనూనిర్వహణనూ లేదా వాటిపై నియంత్రణకు వీలు కల్పించే సాధనాలుతదితర కార్యకలాపాల్లో నిమగ్నమయితే వారు ‘రిపోర్టింగ్ ఎంటిటీ’గా ఎఫ్ఐయూ–ఐఎన్‌డీ వద్ద నమోదు చేసుకోవాలిమనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)–2002 నిబంధనల ప్రకారం నిర్దేశించిన నియమాలను కచ్చితంగా పాటించాలిఈ నియమాలు కార్యకలాపాల ఆధారంగా వర్తిస్తాయిసంస్థ భౌతికంగా భారత్‌లో ఉందా లేదా అనే అంశం ఆధారంగా కాదుఈ నియమాల ప్రకారం ఎఫ్ఐ‌యూ–ఐఎన్‌డీ వద్ద నమోదు చేసుకోవడంతో సహా రిపోర్టింగురికార్డుల నిర్వహణఇతర బాధ్యతలను వీడీయే ఎస్‌పీలు నిర్వర్తించాల్సి ఉంటుంది.

భద్రతఅవగాహన కోసం ప్రజలు ఓ ముఖ్యమైన విషయాన్ని గమనించాలిక్రిప్టో ఉత్పత్తులుఎన్ఎఫ్‌టీలు చట్టపరిధిలో లేవుఇవి చాలా ప్రమాదకరంఇలాంటి లావాదేవీల వల్ల ఏదైనా నష్టం జరిగితే.. చట్టపరంగా ఎలాంటి పరిష్కారం లభించకపోవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2308252) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Gujarati , Tamil