ఆర్థిక మంత్రిత్వ శాఖ
వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్యాంకు ఉద్యోగుల ప్రతినిధివర్గంతో కేంద్ర ఆర్థిక మంత్రి భేటీ
ఉద్యోగుల సమస్యలకు ప్రతిస్పందనగా పీఎస్‌బీ అధికారులకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం ప్రస్తుతానికి నిలుపుదల
నాడు పోస్టు చేయడమైనది:
07 SEP 2026 9:05PM by PIB Hyderabad
భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకత్వంలో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల ఉద్యోగుల ప్రతినిధివర్గంతో కేంద్ర ఆర్థిక మంత్రి ఈ రోజు సమావేశమయ్యారు. ఈ ప్రతినిధివర్గం బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించింది. వాటిలో.. ఎక్స్‌గ్రేషియాపై సమీక్ష, పదవీ విరమణ చేసే ఉద్యోగులకు వైద్య సదుపాయం, పీఎస్‌బీల ఉద్యోగులకు వర్తించే ‘పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల’ (పీఎల్ఐ) పథకం ప్రస్తుత స్వరూపం దిద్దుబాటు సహా ఉద్యోగులకు సంబంధించిన ఇతర సమస్యలు కలిసి ఉన్నాయి.
బ్యాంకు ఉద్యోగులు తెలిపిన సమస్యలపై దృష్టి సారించి, పీఎల్ఐ స్వరూపంపై అందిన వాదనలకు ప్రతిస్పందనగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి వర్తింపచేయదలచిన 2024 నవంబరు 19 నాటి పీఎల్ఐ పథక కార్యాచరణను ప్రస్తుతానికి నిలిపి ఉంచాలనీ, ఈ అంశాన్ని ఇప్పటికే అమలవుతున్న ద్వైపాక్షిక ఒప్పందం/ సంయుక్త నోట్‌పై చర్చల సందర్బంగా పరిశీలించాలనీ నిర్ణయించారు.
బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులతో పాటు బ్యాంకింగ్ రంగ విశాల హితాన్ని దృష్టిలో పెట్టుకొని చర్చ, సంప్రదింపులు, పరస్పర అవగాహనల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2307744)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7