ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పంజాబ్ యూనివర్సిటీలో అధునాతన పరికరాల కేంద్రం, టెక్ ఇన్నొవేషన్ ఫోరమ్‌ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

విశ్వవిద్యాలయాన్ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దే దిశగా సమష్టిగా కృషి చేయాలని పిలుపు

నాణ్యమైన విద్య, పరిశోధనలకు అంతర్జాతీయ గమ్యస్థానంగా నిలుస్తున్న భారత్

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, నషా ముక్త్ భారత్ నిర్మాణంలో ముందుండాలని విద్యార్థులకు సూచన

క్యాంపస్ భద్రతకు యూనివర్సిటీ అత్యంత ప్రాధాన్యమివ్వాలన్న ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 04 SEP 2026 3:42PM by PIB Hyderabad

భారత ఉపరాష్ట్రపతిపంజాబ్ విశ్వవిద్యాలయ ఎక్స్ అఫిషియో ఛాన్సలర్ శ్రీ సిపిరాధాకృష్ణన్.. ఛండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయాన్ని ఈ రోజు సందర్శించారుఅధునాతన పరీక్షా పరికరాల కేంద్రం/కేంద్ర పరికరాల ప్రయోగశాల (ఎస్ఏఐఎఫ్/సీఐఎల్)లో ఏర్పాటు చేసిన అధునాతన పరికరాల కేంద్రాన్ని ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రారంభించారుదీనితోపాటు పంజాబ్ యూనివర్సిటీ టెక్ ఇన్నోవేషన్ ఫోరమ్ (పీయూ-టీఐఎఫ్)ను కూడా ఆయన ప్రారంభించారువిశ్వవిద్యాలయ విద్యాఅనువర్తిత పరిశోధన వ్యవస్థలో ఎస్ఏఐఎఫ్/సీఐఎల్పీయూ-టీఐఎఫ్ కీలక పాత్ర పోషిస్తాయిఇవి పరిశోధకులుఆవిష్కర్తలువివిధ పరిశ్రమలకు అవసరమైన అధునాతన పరీక్ష కేంద్రాలుపరిశోధనలను ఆచరణలోకి తెచ్చే అనువర్తిత పరిశోధన సదుపాయాలుప్రారంభపూర్వ (ఇంక్యుబేషన్), వ్యవస్థాపక సహకారాన్ని అందిస్తాయి.

సభనుద్దేశించి ప్రసంగించిన శ్రీ సిపిరాధాకృష్ణన్.. 1882లో పంజాబ్ విశ్వవిద్యాలయం ప్రారంభమైనప్పటి నుంచి దాని ఘన చరిత్రను గుర్తుచేసుకున్నారుతరతరాలుగా నాయకులనున్యాయకోవిదులనుశాస్త్రవేత్తలనుక్రీడాకారులనుప్రభుత్వ అధికారులను తీర్చిదిద్దుతూ దేశ నిర్మాణంలో ఈ విశ్వవిద్యాలయం కీలక భూమిక పోషించిందన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో.. భారత ఉన్నత విద్యశాస్త్రీయ పరిశోధన వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఉపరాష్ట్రపతి అన్నారునాణ్యమైన విద్యపరిశోధనలుఆవిష్కరణల్లో అంతర్జాతీయ కేంద్రంగా భారత్ వేగంగా ఎదుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ప్రారంభోత్సవాలను రెండు కీలకమైన మైలురాళ్లుగా శ్రీ సిపిరాధాకృష్ణన్ అభివర్ణించారుఅటామిక్ ఫోర్స్ మైక్రోస్కోప్రామన్ స్పెక్ట్రోమీటర్డీఎన్ఏ సీక్వెన్సర్ఫ్లో సైటోమీటర్ఎఫ్‌టీఐఆర్ స్పెక్ట్రోమీటర్ అనే అయిదు అధునాతన శాస్త్రీయ పరికరాల ఏర్పాటుతో.. నానోటెక్నాలజీమెటీరియల్ సైన్స్పర్యావరణ విజ్ఞానంజీనోమిక్స్ వంటి రంగాల్లో విశ్వవిద్యాలయ పరిశోధన సామర్థ్యాలు గణనీయంగా బలోపేతమవుతాయన్నారు.

ఆవిష్కరణల ప్రాధాన్యాన్ని ఉపరాష్ట్రపతి వివరించారు. ‘బయో నెస్ట్‌’ను లాభాపేక్ష లేని (సెక్షన్8) సంస్థగా పంజాబ్ యూనివర్సిటీ సాంకేతిక ఆవిష్కరణల వేదిక (టెక్ ఇన్నోవేషన్ ఫోరమ్)గా మార్చడం ద్వారా.. పరిశోధనలువ్యాపార నైపుణ్యంసాంకేతిక అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కే సరికొత్త వ్యవస్థాగత వేదికగా అది నిలుస్తుందన్నారువిద్యాసంస్థలుపరిశ్రమలుప్రారంభానికి సిద్ధంగా ఉన్న సంస్థలు (ఇంక్యుబేటర్లు), పెట్టుబడిదారులు కలిసి పనిచేస్తేనే ఆవిష్కరణలు పరుగులు పెడతాయని ఆయన స్పష్టం చేశారు.

యువ పరిశోధకులకు దిశానిర్దేశం చేస్తూ... నిర్దిష్ట లక్ష్యంతో పరిశోధనలు సాగించాలనివైఫల్యాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా నిలదొక్కుకోవాలని ఆయన పిలుపునిచ్చారుసమాజ అవసరాలను తీర్చేలాఅందరికీ ఉపయోగపడేలావిస్తృత స్థాయికి తీసుకెళ్లగలిగేలా ఆవిష్కరణలు ఉండాలని సూచించారుపరిశోధనల ఫలితాలు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపాలని పేర్కొన్నారుపరిశోధన ఫలితాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చేలా.. విద్యార్థులుపరిశోధకులు సరైన దిశలో ముందడుగు వేయాలన్నారు.

క్యాంపస్ భద్రత అంశంపైనా ఉపరాష్ట్రపతి స్పందించారుఒక పీహెచ్‌డీ విద్యార్థి మరణం దురదృష్టకరమన్నారువిశ్వవిద్యాలయ ప్రాంగణమంతటా సమగ్ర భద్రతా తనిఖీలు నిర్వహించాల్సిందిగా తక్షణమే అధికారులను ఆదేశించినట్టు తెలిపారుక్యాంపస్‌లోని ప్రస్తుత మౌలిక సదుపాయాలను సమీక్షించి సమగ్ర నివేదిక సమర్పించేందుకు ఒకర్గత కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారువిద్యార్థులుసిబ్బంది భద్రతసంక్షేమానికి విశ్వవిద్యాలయం అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆయన స్పష్టం చేశారు.

నషా ముక్త్ భారత్’ దిశగా ముందుకు సాగాల్సిందిగా విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారుమాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలనికుటుంబ సభ్యులుమిత్రులకు కూడా అవగాహన కల్పించాలని వారిని కోరారు.

ఈ అధునాతన వైజ్ఞానిక కేంద్రాలుపంజాబ్ యూనివర్సిటీ సాంకేతిక ఆవిష్కరణల వేదిక (టెక్ ఇన్నోవేషన్ ఫోరమ్)... పరిశోధనఆవిష్కరణవ్యవస్థాపక రంగాల్లో విశ్వవిద్యాలయ సేవలను మరింత బలోపేతం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారుతరగతి గదులుప్రయోగశాలల నుంచి పుట్టుకొచ్చే ఆలోచనలు యువతకు ఉపాధిగావ్యాపార అవకాశాలుగా నిలవాలనిఆ దిశగా విద్యార్థులుఅధ్యాపకులు కృషి చేయాలని పిలుపునిచ్చారుతద్వారా వికసిత భారత్ఆత్మనిర్భర భారత్ కలల సాకారంలో భాగస్వాములు కావాల్సిందిగా ఉద్బోధించారుఉన్నత విద్యపరిశోధనల్లో అంతర్జాతీయ స్థాయి సంస్థగా పంజాబ్ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిస్తూ... ఉపరాష్ట్రపతి తన ప్రసంగాన్ని ముగించారుఈ దిశగా అవసరమైన సూచనలుసలహాలను అందించాల్సిందిగా విశ్వవిద్యాలయ విద్యార్థులుఅధ్యాపక బృందాన్ని ఆయన కోరారు.

పంజాబ్ గవర్నర్ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ గులాబ్ చంద్ కటారియాహర్యానా గవర్నర్ ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్లోక్‌సభ ఎంపీ శ్రీ మనీశ్ తివారీపంజాబ్ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ మీనాక్షీ గోయల్పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2306831) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Malayalam