ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నిజమైన వివేకి గుణాలను తెలిపే సంస్కృత సుభాషితాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 01 SEP 2026 8:27AM by PIB Hyderabad

నిజమైన వివేకం గల వ్యక్తి గుణాలను చాటిచెబుతున్న ఓ  సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘యస్య కృత్యం న జానన్తి మన్త్రం వా మన్త్రితం పరే
కృతమేవాస్య జానన్తి స వై పండిత ఉచ్యతే’’ అని పేర్కొన్నారు.
ఒక వ్యక్తి తన ప్రణాళికలను, పనులను.. అవి విజయవంతంగా పూర్తి అయ్యే వరకు.. పరులకు తెలియజేయకుండా గోప్యంగా ఉంచినప్పుడు, అలాంటి వ్యక్తిని నిజమైన పండితుడని అనవచ్చు. ఇలాంటి క్రమశిక్షణ, సూక్ష్మ పరిశీలన శక్తి కలిగిన, ఆలోచనాపరుడిని నిజమైన వివేకిగా గౌరవిస్తారని ఈ సుభాషితం చెబుతోంది.


(రిలీజ్ ఐడి: 2305387) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam