యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విశాఖపట్నంలో ముగిసిన బ్రిక్స్-2026 యువజన మంత్రుల సమావేశం... ఉమ్మడి ప్రకటనకు ఆమోదం


బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ, శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే

అభివృద్ధిలో యువత సహకారాన్ని, భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటంపై ఉమ్మడి ప్రకటనను ఆమోదించిన బ్రిక్స్ దేశాల యువజన మంత్రులు

గాంధీనగర్‌లో జరిగిన బ్రిక్స్ యువజన సదస్సు, బ్రిక్స్ యువజన మండలి సదస్సుల ఫలితాల ఆధారంగా జరిగిన సమావేశం

'ఏక్ పేడ్ మా కే నామ్‌' మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని, చారిత్రక తొట్లకొండ బౌద్ధారామాన్ని సందర్శించిన ప్రతినిధులు

प्रविष्टि तिथि: 22 AUG 2026 6:49PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలుక్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం ఆగస్టు 22, 2026న శనివారం రోజున విశాఖపట్నంలో విజయవంతంగా ముగిసింది.

 

ఈ సమావేశానికి యువజన వ్యవహారాలుక్రీడల మంత్రిత్వ శాఖ గౌరవ కేంద్రమంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ అధ్యక్షత వహించారుఈ సమావేశంలో కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడల శాఖ సహాయమంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సేయువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి శ్రీ సునీల్ పలివాల్ పాల్గొన్నారు.

బ్రిక్స్ యువజన శిఖరాగ్ర సమావేశంబ్రిక్స్ యువజన మండలి సమావేశం ఫలితాల ఆధారంగా మంత్రుల సమావేశంలో చర్చలు సాగాయిఈ వేదికల నుంచి వెలువడిన సిఫార్సులుదృక్పథాలు మంత్రుల స్థాయి చర్చలకు కీలక ఆధారంగా నిలిచాయి.

యువజన వ్యవహారాలుక్రీడల మంత్రిత్వ శాఖ గౌరవ కేంద్ర మంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. "భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికిఅంటే 2047 నాటి కోసం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మేం ఒక విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాంఈ దిశగా దేశాన్ని నడిపించేందుకు రాజకీయ నేపథ్యం లేని 1,00,000 మంది యువ నాయకులను తయారుచేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారుఅని తెలిపారు.

"ఈ స్ఫూర్తితోనే మేం అనేక కార్యక్రమాలను ప్రారంభించాంవాలంటీర్ పనిచేయటంనేర్చుకోవటంనాయకత్వంపౌర భాగస్వామ్యం కోసం ఏకైక వేదికగా మైభారత్ పోర్టల్‌ను తయారుచేశాంనేడు 25 మిలియన్లకు పైగా యువత ఈ వేదికలో రిజిస్టర్ అయిఉత్సాహంగా పాల్గొంటున్నారుఅని అన్నారు.

బ్రిక్స్ సభ్యభాగస్వామ్య దేశాల యువ ప్రతినిధులుయువ నాయకులువిధాన రూపకర్తలుఉన్నతాధికారులను ఈ వేదికలు ఒకచోట చేర్చాయిఇవి యువతకు ప్రాధాన్యతనిచ్చే అంశాలపై చర్చించేందుకుఅనుభవాలను పరస్పరం పంచుకునేందుకుకలిసి పనిచేసేందుకు సరైన వేదికలుగా నిలిచాయి.

 

యువజన వ్యవహారాలుక్రీడా శాఖ మంత్రి మాట్లాడుతూ... మెరుగైన భవిష్యత్తును తీర్చిదిద్దటంలో యువత భాగస్వామ్యం కీలకమని స్పష్టం చేశారు. "బ్రిక్స్ భారత అధ్యక్షతన మా విధానం చాలా స్పష్టంగా ఉందియువతను కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాక భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఉమ్మడి క్రియాశీల భాగస్వాములుగా గుర్తించాలియువత భాగస్వామ్యం నుంచి యువత భాగస్వామ్య బంధానికిసంప్రదింపుల నుంచి సహ-రూపకల్పనయువత కోసం కార్యక్రమాలు నుంచి యువతతో కలిసి వేదికల నిర్మాణం దిశగా మనం అడుగులు వేద్దాంభవిష్యత్తు కోసం మాత్రమే యువత సన్నద్ధం కావటమే కాకతామే స్వయంగా భవిష్యత్తును తీర్చిదిద్దేలా బ్రిక్స్ దేశాలను నిర్మిద్దాంఅని తెలిపారు.

బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సందర్భంగా 'ఏక్ పేడ్ మా కే నామ్మొక్కలు నాటే ప్రత్యేక కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొనివారి మాతృమూర్తుల గౌరవార్థం ఒక్కో మొక్కను నాటారుమాతృమూర్తుల పట్ల కృతజ్ఞతను చాటే హృదయపూర్వకప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని పర్యటనకు వచ్చిన ప్రతినిధి బృందాలు అభినందించాయి.

విశాఖపట్నం సమీపంలోని ప్రముఖ చారిత్రక వారసత్వ ప్రదేశాల్లో ఒకటైన తొట్లకొండ బౌద్ధారామాన్ని కూడా ప్రతినిధులు సందర్శించారుఈ సందర్శన భారతదేశ సుసంపన్న నాగరికత వారసత్వాన్నిశాంతిసామరస్యాలుసాంస్కృతిక మార్పిడికి సంబంధించిన సుదీర్ఘ సంప్రదాయాలను ప్రతినిధులకు కళ్లకు కట్టినట్లు చూపిందిపర్యటనకు వచ్చిన ప్రముఖుల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందిఈ మొత్తం కార్యక్రమం... సుసంపన్నమైన సాంస్కృతిక కోణాన్ని జోడించటంతో పాటు బ్రిక్స్ దేశాల యువత మధ్య మైత్రినిపరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసింది.

 

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఆగస్టు 19 నుంచి 20, 2026 వరకు జరిగిన బ్రిక్స్ యువజన సదస్సుబ్రిక్స్ యువజన మండలి సదస్సు అనంతరం యువజన కార్యక్రమాల ముగింపులో భాగంగా బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశాన్ని నిర్వహించారుబ్రిక్స్ సభ్య దేశాల యువజన వ్యవహారాల మంత్రులుసీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారుయువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించటంవిధివిధానాలపై దృక్పథాలను పరస్పరం పంచుకోవటంసమ్మిళితసుస్థిరాభివృద్ధిలో యువత పాత్రను మరింత ముందుకు తీసుకెళ్లటంపై ఈ సమావేశంలో చర్చించారు.

సంయుక్త ప్రకటనను ఆమోదించటం... ఈ సమావేశ ముగింపులో కీలకమైనదిఇది బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారాన్ని బలోపేతం చేయటానికిఅభివృద్ధి ప్రక్రియల్లో యువత పాల్గొనేలా ప్రోత్సహించటానికి ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుందిఈ సంయుక్త ప్రకటనలో విద్యశిక్షణనైపుణ్యాలుయువజన పారిశ్రామికవేత్తల అభివృద్ధిశాస్త్రసాంకేతికతఆవిష్కరణసామాజికసాంస్కతిక భాగస్వామ్యంసామాజిక సేవవాలంటరీ కార్యక్రమాలుఅభివృద్ధిపేదరికంఆకలిఅసమానతల నిర్మూలనఆరోగ్యంయువతక్రీడలుయువతపర్యావరణంసుస్థిరతవివిధ మతాల యువత చర్చయువజన మార్పిడి కార్యక్రమాలుయువత భాగస్వామ్యం వంటివి ప్రధాన అంశాలు.

యువత సామర్థ్యాలను పెంపొందించుకోవటానికినిర్ణయాల్లో అర్థవంతంగా భాగస్వాములయ్యేందుకుయువతకు సంబంధించిన సమకాలీన సమస్యల పరిష్కారానికి సహకరించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించటం మంత్రుల సమావేశంలో చర్చించిన కీలక అంశాల్లో ఒకటియువత నేతృత్వంలోని కార్యక్రమాలను బలోపేతం చేయటంనూతన ఆవిష్కరణలువ్యవస్థాపకతను పెంపొందించటంఅనుభవాలను పరస్పరం పంచుకోవటంసాధారణ ప్రయోజన అంశాలపై అభిప్రాయాలను అందించటం ద్వారా వివిధ దేశాల మధ్య యువత సహకారాన్ని పెంపొందించాల్సిన ప్రాధాన్యతను స్పష్టం చేశారు.

బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం విజయవంతంగా ముగియటంబ్రిక్స్ యువజన మంత్రుల సంయుక్త ప్రకటనకు ఆమోదం లభించటంబ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలుస్తుంది.

బ్రిక్స్ దేశాల యువకులుసంస్థల మధ్య భాగస్వామ్యాలను బ్రిక్స్ యువజన కార్యక్రమాలు బలపరిచాయిపరస్పర అవగాహనను పెంపొందించాయినిరంతర సహకారానికి నూతన మార్గాలను సృష్టించాయి.

బ్రిక్స్-2026 భారతదేశ అధ్యక్షతన, "పటిష్ఠతఆవిష్కరణసహకారంసుస్థిరత కోసం నిర్మాణంఇతివృత్తానికి అనుగుణంగా... ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవటంజాతీయ ప్రాధాన్యతలుసహకార చర్యలపై ప్రత్యేక దృష్టి సారించి యువజన సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ యువజన వేదికలు సహకరించాయి.

బ్రిక్స్-2026 భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ యూత్ క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్‌లో భాగంగా బ్రిక్స్ యువజన సదస్సుబ్రిక్స్ యువజన మండలి సమావేశంబ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం నిర్వహించారుఇందులో భాగంగా ఆగస్టు 22, 2026న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది.

భారత బ్రిక్స్ అధ్యక్ష హోదా ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ వేదిక ద్వారా సాధించిన ఫలితాలు భవిష్యత్ సహకారానికి బలమైన పునాదిని అందిస్తున్నాయిమరింత పటిష్ఠమైననూతన ఆవిష్కరణలతో కూడినసమ్మిళితసుస్థిర భవిష్యత్‌ నిర్మాణంలో యువ శక్తిని వినియోగించుకోవాలనే బ్రిక్స్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఇవి మరోసారి స్పష్టం చేశాయి.

 

బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సందర్భంగా... దక్షిణాఫ్రికాయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మంత్రులతో డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవీయ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారునైపుణ్యాభివృద్ధియువ పారిశ్రామికవేత్తలుయువత భాగస్వామ్యానికి డిజిటల్ వేదికలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ... యువజన వ్యవహారాలుక్రీడా రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయటంపై ఈ చర్చలు దృష్టి సారించాయి.

యువతక్రీడా రంగాల్లో భారత్సంబంధిత దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయటానికి... మార్పిడి కార్యక్రమాలుసామర్థ్య పెంపుదల కార్యక్రమాలుసంస్థాగత విధానాల ద్వారా మరింతగా సహకరించుకోవాలని అన్ని దేశాలు చర్చించాయి.

 

***


(रिलीज़ आईडी: 2302456) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Odia , Tamil , Telugu_Vw , Malayalam