యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విశాఖపట్నంలో ముగిసిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం; ఉమ్మడి ప్రకటన ఆమోదం

బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే


అభివృద్ధిలో యువత సహకారాన్ని, భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై ఉమ్మడి ప్రకటనను ఆమోదించిన బ్రిక్స్ దేశాల యువజన మంత్రులు


గాంధీనగర్‌లో జరిగిన బ్రిక్స్ యూత్ సమ్మిట్, బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశ ఫలితాల ఆధారంగా కొనసాగిన చర్చలు


'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో పాల్గొని, చారిత్రాత్మక తోట్లకొండ బౌద్ధారామాన్ని సందర్శించిన ప్రతినిధులు

प्रविष्टि तिथि: 22 AUG 2026 6:49PM by PIB Vijayawada

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖలోని యువజన వ్యవహారాల విభాగం నిర్వహించిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం శనివారం, ఆగస్టు 22, 2026 న విశాఖపట్నంలో విజయవంతంగా ముగిసింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2026-08-22at7.28.13PM8U1P.jpeg

 

ఈ సమావేశానికి గౌరవ కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించగా, గౌరవ యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే, మరియు యువజన వ్యవహారాల విభాగం కార్యదర్శి శ్రీ సునీల్ పాలివాల్ పాల్గొన్నారు

గాంధీనగర్‌లో జరిగిన బ్రిక్స్ యూత్ సమ్మిట్ మరియు బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశాల ఫలితాల ఆధారంగా ఈ మంత్రుల సమావేశంలో చర్చలు జరిగాయి. ఆ కార్యక్రమాల నుంచి వచ్చిన సిఫార్సులు, దృక్పథాలు ఈ మంత్రివర్గ చర్చలకు ఒక ముఖ్యమైన పునాదిని అందించాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002XYOL.jpg

 

ప్రతినిధులను ఉద్దేశించి గౌరవ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. "గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 సంవత్సరం కోసం మేము ఒక విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాము. ఈ విజన్‌ను సాకారం చేసే దిశగా దేశాన్ని నడిపించేందుకు రాజకీయ నేపథ్యం లేని 1,00,000 మంది యువ నాయకులను తీర్చిదిద్దాలని ప్రధాని పిలుపునిచ్చారు అని అన్నారు. అదే స్ఫూర్తితో మేము అనేక కార్యక్రమాలను ప్రారంభించాము. స్వచ్ఛంద సేవ, అభ్యాసం, నాయకత్వం, పౌర భాగస్వామ్యం కోసం ఒకే వేదికగా 'మై భారత్' ని ఏర్పాటు చేశాము. ఈ రోజు, 2.5 కోట్లకు పైగా యువకులు ఈ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకుని చురుగ్గా పాల్గొంటున్నారు" అని తెలిపారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003G8JB.jpg

 

ఈ కార్యక్రమాలలో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి యువ ప్రతినిధులు, యువ నాయకులు, విధానకర్తలు మరియు సీనియర్ అధికారులు పాల్గొని, యువతకు ప్రాధాన్యత ఉన్న అంశాలపై సంభాషణలు, అనుభవాల మార్పిడి మరియు ఉమ్మడి చర్యల కోసం వేదికలను ఏర్పరచుకున్నారు.

మంచి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువతతో భాగస్వామ్యం వహించాల్సిన అవసరాన్ని గౌరవ మంత్రి మరింతగా ఉద్ఘాటించారు. ఆయన మాట్లాడుతూ.. బ్రిక్స్ భారత అధ్యక్షతలో, మన భాగస్వామ్య భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా చురుకైన భాగస్వాములుగా గుర్తించాలనేది మా స్పష్టమైన దృక్పథం. కేవలం 'యువత భాగస్వామ్యం' నుంచి 'యువత భాగస్వామ్య బంధం' వైపు; సలహాలు తీసుకోవడం నుంచి 'సహ-సృష్టి' వైపు; యువత కోసం కార్యక్రమాల నుంచి 'యువతతో నిర్మించే వేదికల' వైపు అడుగులు వేద్దాం. యువత భవిష్యత్తు కోసం సిద్ధపడడమే కాకుండా, దాన్ని స్వయంగా తీర్చిదిద్దే బ్రిక్స్ ని మనం కలిసి నిర్మిద్దాం" అన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0044BRB.jpg

 

 

ఈ సమావేశాల సందర్భంగా ప్రతినిధులు 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో భాగస్వాములై తమ తల్లుల జ్ఞాపకార్థం ఒక్కో మొక్కను నాటారు. ప్రతినిధి బృందాలు ఈ వినూత్న భావోద్వేగ కార్యక్రమాన్ని ఎంతగానో అభినందించాయి

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2026-08-22at7.38.15PMARSL.jpeg

 

 

అలాగే ప్రతినిధులు విశాఖపట్నం సమీపంలో ఉన్న ప్రముఖ వారసత్వ ప్రదేశాలలో ఒకటైన చారిత్రాత్మక తోట్లకొండ బౌద్ధారామాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్శన భారతదేశ ప్రాచీన నాగరికతా వారసత్వాన్ని, శాంతి, సామరస్యం మరియు సాంస్కృతిక మార్పిడి సంప్రదాయాలను ప్రతినిధులకు పరిచయం చేసింది. విహారయాత్ర ప్రతినిధులకు ఎంతో నచ్చడంతో పాటు మొత్తం కార్యక్రమానికి ఒక గొప్ప సాంస్కృతిక కోణాన్ని జోడించి, బ్రిక్స్ దేశాల యువత మధ్య స్నేహబంధాలను, పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006GWNY.jpg

 

ఆగస్టు 19-20 తేదీల్లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన బ్రిక్స్ యూత్ సమ్మిట్, బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశాల అనంతరం విశాఖపట్నంలో జరిగిన ఈ మంత్రుల సమావేశంతో యువజన కార్యక్రమాలు ముగిసాయి. బ్రిక్స్ దేశాల నుంచి యువజన వ్యవహారాల బాధ్యత వహించే మంత్రులు, సీనియర్ అధికారులు ఇందులో పాల్గొని, యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు, విధాన దృక్పథాలను పంచుకున్నారు మరియు సుస్థిర, అందరినీ కలుపుకొనిపోయే అభివృద్ధిలో యువత పాత్రను పెంచే ప్రాధాన్యతలపై చర్చించారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007ROUF.jpg

ఈ మంత్రుల సమావేశంలో సాధించిన అతిముఖ్యమైన ఫలితం 'ఉమ్మడి ప్రకటన' ను ఆమోదించడం. ఇది యువజన సహకారాన్ని పెంచడానికి, అభివృద్ధి ప్రక్రియలలో యువత యొక్క అర్థవంతమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని తెలియజేస్తుంది. ఈ ఉమ్మడి ప్రకటనలో విద్య, శిక్షణ మరియు నైపుణ్యాలు; యువజన వ్యాపారవేత్తత; సైన్స్, టెక్నాలజీ మరియు ఆవిష్కరణలు; సామాజిక మరియు సాంస్కృతిక భాగస్వామ్యం, సామాజిక సేవ మరియు స్వచ్ఛంద సేవ; అభివృద్ధి, పేదరికం, ఆకలి మరియు అసమానతలపై పోరాటం; ఆరోగ్యం, యువత మరియు క్రీడలు; యువత, పర్యావరణం మరియు సుస్థిరత; మతాంతర యువ సంభాషణలు; యువజన మార్పిడి; మరియు యువజన సమ్మేళనం/కలుపుకొనిపోవడం వంటి అంశాల ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008RRO8.jpg

 

యువత తమ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, నిర్ణయాధికారంలో అర్థవంతంగా పాల్గొనడానికి, సమకాలీన సమస్యల పరిష్కారానికి తోడ్పడటానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై మంత్రుల సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అలాగే యువత నేతృత్వంలోని కార్యక్రమాలను బలోపేతం చేయడం, ఆవిష్కరణలు, వ్యాపారవేత్తతను ప్రోత్సహించడం, ఆలోచనలు, అనుభవాల మార్పిడి ద్వారా సరిహద్దులు దాటి యువత మధ్య భాగస్వామ్య అవకాశాలను విస్తరించడం యొక్క ప్రాముఖ్యతను వారు ఉద్ఘాటించారు.

 

బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం విజయవంతంగా ముగియడం, ఉమ్మడి ప్రకటన ఆమోదం పొందడం అనేది బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ బ్రిక్స్ యువజన కార్యక్రమాలు భాగస్వామ్యాలను బలోపేతం చేశాయి, పరస్పర అవగాహనను పెంచాయి, బ్రిక్స్ దేశాల యువత, సంస్థల మధ్య నిరంతర సహకారం కోసం కొత్త మార్గాలను సృష్టించాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009BP3L.jpg

 

భారతదేశం యొక్క 2026 బ్రిక్స్ అధ్యక్షత థీమ్ "స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం" కు అనుగుణంగా, ఉత్తమ విధానాల మార్పిడి, జాతీయ ప్రాధాన్యతలు, ఉమ్మడి చర్యలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాలు సాగాయి.

బ్రిక్స్ యూత్ క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్‌లో భాగంగా భారతదేశ బ్రిక్స్ అధ్యక్షత 2026 కింద బ్రిక్స్ యూత్ సమ్మిట్, బ్రిక్స్ యూత్ కౌన్సిల్ సమావేశం, బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం నిర్వహించబడ్డాయి; ఆగస్టు 22, 2026న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం విజయవంతంగా పూర్తయింది.

భారతదేశం వహిస్తున్న బ్రిక్స్ అధ్యక్షత ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, ఈ కార్యక్రమాల ఫలితాలు నిరంతర సహకారానికి బలమైన పునాదిని అందిస్తాయి. మరింత స్థిరమైన, ఆవిష్కరణాత్మక, అందరినీ కలుపుకొనిపోయే, సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో యువత శక్తులు, సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి బ్రిక్స్ దేశాల ఉమ్మడి కట్టుబడిని ఇవి పునరుద్ఘాటిస్తాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0109UU5.jpg

 

ఈ సమావేశాల మధ్యలో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మంత్రులతో ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. నైపుణ్యాభివృద్ధి, యువ పారిశ్రామికవేత్త, యువత భాగస్వామ్యం కోసం డిజిటల్ వేదికలపై ప్రాధాన్యత ఇస్తూ, యువజన వ్యవహారాలు మరియు క్రీడల రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయి.

యువజన మరియు క్రీడా రంగాలు రెండింటిలోనూ భారత్ మరియు ఆయా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మార్పిడి కార్యక్రమాలు, సామర్థ్య పెంపు ఉపాధి కార్యక్రమాలు, వ్యవస్థాగత చట్రాల ద్వారా మరింత లోతైన సహకారం కోసం మార్గాలను అన్ని వర్గాలు అన్వేషించాయి.

*****


(रिलीज़ आईडी: 2302413) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Odia , Tamil , Malayalam