ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాలుగేళ్లలోపు పిల్లల కోసం ఉపయోగించే క్లోర్‌ఫెనిరమైన్ మలేట్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ నిర్దిష్ట డోస్ కాంబినేషన్స్ తయారీ, అమ్మకం, పంపిణీపై ప్రభుత్వం ఆంక్షలు

प्रविष्टि तिथि: 22 AUG 2026 9:47AM by PIB Hyderabad

చిన్నారుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఒక ముఖ్యమైన చర్య చేపట్టింది. క్లోర్‌ఫెనిరమైన్ మలేట్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ కలిగిన అన్ని నిర్ధిష్ట డోస్ కాంబినేషన్స్ తయారీ, అమ్మకం, పంపిణీపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నాలుగేళ్లలోపు వయస్సు గల పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఔషదాన్ని వాడరాదని స్పష్టమైన హెచ్చరికను జారీ చేసింది.

2025, ఏప్రిల్ 15 నాటి నోటిఫికేషన్ [S.O. 1717(E)] ద్వారా, ప్రభుత్వం క్లోర్‌ఫెనిరమైన్ మలేట్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ కలిగిన కొన్ని ఎఫ్‌డీసీలను ఆ నిర్ధిష్ట వయస్సు గల పిల్లల కోసం ఉపయోగించకూడదని గతంలో ఆంక్షలు విధించింది. తాజా నోటిఫికేషన్ ద్వారా ఈ రెండు పదార్థాలు కలిగిన అన్ని ఫార్ములేషన్‌లకూ ఈ నిబంధనను విస్తరించింది.

నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీ) సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి కాంబినేషన్‌ల వాడకం నాలుగేళ్లలోపు పిల్లలకు ప్రమాదకరమని, దీని కోసం సురక్షిత ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.

ఈ ఫార్ములేషన్‌లకు సంబంధించిన లేబుల్, ప్యాకేజీ ఇన్సర్ట్, ప్రమోషనల్ లిటరేచర్‌పై “నాలుగేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లల కోసం ఈ ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఉపయోగించకూడదు” అనే హెచ్చరికను స్పష్టంగా ప్రదర్శించాలని తయారీదారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఔషధాలు,సౌందర్య సాధనాల చట్టం-1940లోని సెక్షన్ 26A కింద ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అధికారిక గెజెట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

అధికారిక గెజెట్‌ను ఇక్కడ పొందవచ్చు: https://egazette.gov.in/WriteReadData/2026/275640.pdf


(रिलीज़ आईडी: 2302320) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam