ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాంబియా అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైన సందర్భంగా అధ్యక్షుడు శ్రీ హాకాయిండే హిచిలేమాకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

प्रविष्टि तिथि: 20 AUG 2026 9:50PM by PIB Hyderabad

జాంబియా అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైన సందర్భంగా అధ్యక్షుడు శ్రీ హాకాయిండే హిచిలేమాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అనేక రంగాల్లో జాంబియాతో భారత్‌కు ఉన్న భాగస్వామ్యానికి భారత్ అమిత ప్రాధాన్యాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి అన్నారు.
అధ్యక్షుడు శ్రీ హాకాయిండే హిచిలేమా నాయకత్వంలో భారత్, జాంబియా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఆయనతో కలిసి పనిచేయాలని ఉందని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘జాంబియా అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైన సందర్భంగా అధ్యక్షుడు శ్రీ హాకాయిండే హిచిలేమాను మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను.
జాంబియాతో అనేక రంగాల్లో భారత్‌కు భాగస్వామ్యం ఉంది. ఈ భాగస్వామ్యానికి భారత్ అమిత ప్రాధాన్యాన్నిస్తోంది.మన ఇరు దేశాల పరస్పర సంబంధాలను మరింత పటిష్ఠపరుచుకోవడానికి శ్రీ హాకాయిండే హిచిలేమా నాయకత్వంలో కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2301894) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam