ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత బ్రిక్స్ సారథ్యం, సుస్థిర అభివృద్ధిపై ఒక వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 20 AUG 2026 9:39PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

ప్రజా కేంద్రిత వాతావరణ చర్యల ద్వారా భారత బ్రిక్స్ సారథ్యం సుస్థిర అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకువెళ్తుందో ఈ వ్యాసం వివరిస్తుంది. సుస్థిర జీవనశైలి, అడవుల పెంపకం, సర్క్యులర్ ఎకానమీ, కమ్యూనిటీ ఆధారిత అనుసరణ వంటి చర్యలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ఇది ప్రస్తావిస్తుంది. ఉద్గారాల తీవ్రతను తగ్గించడంలో, శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని విస్తరించడంలో భారత్ సాధించిన పురోగతినీ ఇది ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఈ విధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

“ప్రజా కేంద్రిత వాతావరణ చర్యల ద్వారా సుస్థిర అభివృద్ధిని భారత్ బ్రిక్స్ సారథ్యం ఎలా ముందుకు తీసుకెళ్తుందో కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ చక్కగా వివరించారు.

సుస్థిర జీవనశైలి, అడవుల పెంపకం, సర్క్యులర్ ఎకానమీ, కమ్యూనిటీ ఆధారిత అనుసరణ వంటి చర్యలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఉద్గారాల తీవ్రతను తగ్గించడంలోనూ, శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని విస్తరించడంలోనూ భారత్ సాధించిన పురోగతి ఈ విధానాన్ని బలపరుస్తుంది.”

 

***


(రిలీజ్ ఐడి: 2301881) సందర్శకుల సూచీ సంఖ్య : : 55
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam