ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖనిజ భద్రత, దేశీయ ఇనుప ఖనిజ లభ్యతను బలోపేతం చేసేందుకు ఎంఎండీఆర్ సవరణ చట్టం-2026ను స్వాగతించిన సెయిల్

నాడు పోస్టు చేయడమైనది: 20 AUG 2026 3:49PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 17, 2026న ప్రకటించిన గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టం-2026ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) స్వాగతించింది. ఖనిజ రంగంలో స్థిరమైన ఆర్థిక విధానాన్ని, దీర్ఘకాలిక నిబంధనల భద్రతను ఏర్పాటు చేయటంలో ఇది కీలక సంస్కరణ అని పేర్కొంది.

సొంతంగా ఇనుప ఖనిజం, బొగ్గు గనులను నిర్వహించే సెయిల్ సంస్థకు, ఈ సంస్కరణల వల్ల గనుల నిర్వహణ మరింత లాభసాటిగా మారనుంది. గనుల అభివృద్ధికి పెట్టుబడులు సులభతరమై, దీర్ఘకాలికంగా ముడి సరకుల భద్రత మరింత బలపడుతుంది. పన్ను విధానంలో మరింత స్పష్టత రావటం వల్ల ఖనిజ వనరులను సెయిల్ సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేయటానికి తోడ్పడుతుంది. ఇనుప ఖనిజ తవ్వకాలను మరింత ప్రోత్సహిస్తుంది.

ఈ సంస్కరణ ముఖ్యంగా దేశీయ మార్కెట్లో ఇనుప ఖనిజం లభ్యతను పెంచటానికి కూడా దోహదపడుతుంది. సొంత గనుల నిర్వహణ మెరుగవటం వల్ల సెయిల్ నిబంధనలకు లోబడి మార్కెట్లో అమ్మకానికి అదనపు ఇనుప ఖనిజాన్ని అందుబాటులో ఉంచగలదు. ఇది దేశీయ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. భారత ఉక్కు పరిశ్రమకు దేశీయంగా ఇనుప ఖనిజం సులభంగా లభించేలా మద్దతిస్తుంది.

ఈ సంస్కరణ ద్వారా పెట్టుబడులు, ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తుందని, దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, ఖనిజ, ఇంధన భద్రత బలపడుతుందని, ఖనిజ ఆధారిత పరిశ్రమల పోటీతత్వం మెరుగవుతుందని అంచనా.

ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ ఆశయ సాధనకు అనుగుణంగా… ఖనిజ వనరుల బాధ్యతాయుత, సుస్థిర అభివృద్ధికి, అంతర్గతంగా ముడి సరకుల భద్రతను బలోపేతం చేయటానికి, దేశీయ మార్కెట్‌కు ఎక్కువ మొత్తంలో ఇనుప ఖనిజాన్ని అందుబాటులోకి తీసుకురావటానికి సెయిల్ కట్టుబడి ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2301750) సందర్శకుల సూచీ సంఖ్య : : 54
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Tamil , Kannada