సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ ఈ గవర్నెన్స్ డివిజన్ రూపొందించిన సమావేశ్‌ వేదికలోకి విజయవంతంగా మారిన నషా ముక్త్ భారత్ అభియాన్ వేదిక


నషా ముక్త్ భారత్ అభియాన్ వేదిక, ఈ ప్రతిజ్ఞ, నషా ముక్తి మిత్ర నమోదు, మొబైల్‌ యాప్‌ లింక్‌లు, క్యూఆర్ కోడ్‌ల విడుదల

నాడు పోస్టు చేయడమైనది: 19 AUG 2026 5:09PM by PIB Hyderabad

నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్‌ఎంబీఏ) వేదికను పాత వేదిక (nmba.dosje.gov.in) నుంచి జాతీయ ఈ-గవర్నెన్స్ డివిజన్‌ అభివృద్ధి చేసిన సమావేశ్ వేదికకు (https://www.dosje.gov.in/organisation/nasha-mukt-bharat-abhiyaan/) సామాజిక న్యాయం, సాధికారత శాఖ విజయవంతంగా మార్చింది.

 

ఇకపై ఎన్‌ఎంబీఏ వేదిక కొత్త లింక్‌లు, క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా అందుబాటులోకి వస్తుందని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోని సంయుక్త కార్యదర్శి (మత్తుపదార్థాల నిరోధక విభాగం) డాక్టర్ సందీప్ ఆర్ రాథోడ్ తెలిపారు. అవి

 

1. ఎన్‌ఎంబీఏ వేదిక... https://www.dosje.gov.in/organisation/nasha-mukt-bharat-abhiyaan

2. ఎన్‌ఎంబీఏ ఈ-ప్రతిజ్ఞ... https://nashamukt.dosje.gov.in/epledge

3. నషా ముక్తి మిత్ర నమోదు... https://nashamukt.dosje.gov.in/nasha-mukti-mitr

4.. ఎన్‌ఎంబీఏ లాగిన్‌... https://nashamukt-admin.dosje.gov.in/login

5. ఎన్‌ఎంబీఏ మొబైల్ యాప్: https://play.google.com/store/search?q=nasha+mukt+bharat+abhiyan&c=apps&hl=en

 వీటి ద్వారా నషా ముక్త్ భారత్ అభియాన్‌కు సంబంధించిన సమాచారం, సేవలను ప్రజలు మరింత సులభంగా పొందవచ్చు.

డాక్టర్ రాథోడ్ మాట్లాడుతూ.. పాత ఎన్‌ఎంబీఏ వేదికను విజయవంతంగా కొత్త వేదికకు మార్చిన నేపథ్యంలో ఇకపై పాత వేదిక (nmba.dosje.gov.in) అందుబాటులో ఉండదని తెలిపారు.

 

నషా ముక్తి మిత్ర నమోదు క్యూఆర్‌ కోడ్‌


ఎన్‌ఎంబీఏ మొబైల్‌ యాప్‌ క్యూఆర్‌ కోడ్‌

ఎన్‌ఎంబీఏ, ఈ-ప్రతిజ్ఞ, మిత్ర రిజిస్ట్రేషన్‌ కోసం కొత్త లింకులను ఉపయోగించాలని అన్ని సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలను మంత్రిత్వ శాఖ కోరింది. ఇకపై ఎన్‌ఎంబీఏ వేదికను ఉపయోగించడానికి కొత్త సమావేశ్‌ వేదిక లింక్‌లనే మాత్రమే వాడాలని భాగస్వాములందరికీ స్పష్టం చేసింది. అధికారిక సమాచారాలు, వెబ్‌సైట్లు, ఐఈసీ సమాచారం, ఇతర పత్రాల్లో పాత వేదిక‌ లింకులు ఉంటే వాటిని కొత్త లింకులతో మార్చాలని సూచించింది. ఏవైనా ఇతర మార్పులను అధికారికంగా తెలియజేస్తే తప్ప... ప్రస్తుతం ఉన్న లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు  చెల్లుబాటులోనే ఉంటాయని తెలిపింది.


ఎన్‌ఎంబీఏ ఈ ప్రతిజ్ఞ క్యూఆర్‌ కోడ్‌

 ఇకపై అన్ని రకాల కార్యకలాపాలు, సమాచార నివేదికలు, ఈ-ప్రతిజ్ఞలు, నషా ముక్తి మిత్ర నమోదులు, వేదిక ఆధారిత ఇతర విధులను కూడా ఈ కొత్త వేదిక ద్వారానే నిర్వహించాలని పేర్కొంది. 

 

ఏవైనా సందేహాలుంటే సామాజిక న్యాయం, సాధికారత శాఖ అండర్ సెక్రటరీ అరుణ్ కుమార్ కర్ణ్‌ను usdp1-dosje[at]gov[dot]in ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2301353) సందర్శకుల సూచీ సంఖ్య : : 95
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada