పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
దేశీయ పీఎన్‌జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకం
प्रविष्टि तिथि:
18 AUG 2026 9:13PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇళ్లకు పైపుల ద్వారా వంటగ్యాస్ సరఫరా లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక ప్రోత్సాహక పథకానికి ఆమోదం తెలిపింది. దీనికింద కాలుష్యరహిత, సురక్షిత ‘పీఎన్‌జీ’ని చౌకధరతో గృహాలకు సరఫరా చేస్తారు. పీఎన్‌జీ కనెక్షన్ల క్రియాశీల విస్తరణ వేగం పెంచేందుకు ఉద్దేశించిన ఈ పథకం ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి అమలులోకి వస్తుంది. తద్వారా దేశంలోని మరిన్ని కుటుంబాలు పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు వినియోగాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించగలవు.
దీని ద్వారా సామాన్యులకు లభించే ప్రయోజనాలు
దేశంలో ప్రస్తుతం 1.74 కోట్ల గృహ వినియోగ పీఎన్‌జీ కనెక్షన్లున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లుల కిందికి రాని వంటగ్యాస్ కనెక్షన్ల క్రమబద్ధీకరణకు కొత్త పథకం తోడ్పడుతుంది. అలాగే, మరిన్ని ప్రాంతాలకు పీఎన్‌జీ నెట్‌వర్క్ విస్తరణ దిశగా ‘సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్’ (సీజీడీ) కంపెనీలకు ప్రత్యక్ష ప్రోత్సాహం లభిస్తుంది.
పైపుల ద్వారా సంపీడన సహజ వాయువు (పీఎన్‌జీ) సరఫరాతో సత్ఫలితాలివే:
సహజ వాయువు పైపుల ద్వారా సరఫరా అవుతుంది కాబట్టి, ప్రస్తుత ‘ఎల్‌పీజీ’ సిలిండర్లు, సంప్రదాయ ఇంధనాల స్థానంలో కింది విధంగా కాలుష్య రహిత, సురక్షిత, సౌకర్య సహిత ప్రత్యామ్నాయం కాగలదు:
భద్రత: ‘ఎల్‌పీజీ’తో పోలిస్తే సహజ వాయువు తక్కువ పీడనంతో భూగర్భ పైప్‌లైన్‌ల ద్వారా సరఫరా అవుతుంది కాబట్టి, సిలిండర్ నిల్వ-నిర్వహణ ముప్పు తొలగిపోతుంది. ఇది అత్యంత తేలికైనది గనుక లీకేజీ సంభవిస్తే త్వరగా, సురక్షితంగా గాలిలో కలసిపోతుంది.
సౌకర్యం: సిలిండర్ల బుకింగ్, నిల్వ-మార్పు వంటి ఇబ్బందులు ఉండవు. విద్యుత్తు లేదా నీటి సరఫరా తరహాలో 24 గంటలూ నేరుగా వంటింటికి గ్యాస్ అందుబాటులో ఉంటుంది. అలాగే, మీటర్ ద్వారా వాస్తవ వినియోగ నమోదు, బిల్లింగ్ పద్ధతులు పాటిస్తారు.
సరసమైన ధర: గృహాల్లో వాస్తవ వినియోగ పరిమాణానికి మాత్రమే బిల్లు చెల్లిస్తారు. యూనిట్ ఇంధనం పరంగా చూస్తే ‘ఎల్‌పీజీ’కన్నా పీఎన్‌జీ చౌకగా లభిస్తుంది. కాబట్టి, కాలక్రమంలో నెలవారీ గృహ ఇంధన ఖర్చు తగ్గుతుంది.
పర్యావరణ హితం: ఇది కాలుష్య రహిత ఇంధనం గనుక సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే కాలుష్య కారకాల విడుదల తక్కువ కాబట్టి, ఇళ్లలో గాలి నాణ్యతకు, స్వల్ప కర్బన ఉద్గారాలకు తోడ్పడుతుంది.
నిరంతర సరఫరా: పైప్‌లైన్ ద్వారా నిరంతర సరఫరా ఫలితంగా సిలిండర్ల రవాణా, డెలివరీ పరంగా పరాధీనత తగ్గుతుంది. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలు, జనసాంద్రత గల పట్టణ ప్రాంతాల్లోని గృహాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
పీఎన్‌జీ విస్తరణకు ప్రభుత్వ నిరంతర కృషి
దేశవ్యాప్తంగా పీఎన్‌జీ వినియోగ వేగం పెంచేందుకు, కుటుంబాలు కాలుష్య రహిత వంటగ్యాస్ వైపు మళ్లడానికి ప్రభుత్వ నిరంతర కృషి, వివిధ చర్యలకు అనుగుణంగా ఈ పథకం రూపొందింది:
క్రమబద్ధ నియంత్రణ అనుమతులు: సహజవాయువు-పెట్రోలియం డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్-2026 కింద వేగంగా ఆమోదం లభించే చట్రం, ప్రామాణిక ‘రైట్-ఆఫ్-వే’ రుసుములను నిర్ణయించారు. ప్రామాణిక రుసుములతో పాటు పీఎన్‌జీ మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన దరఖాస్తులను నిర్దిష్ట వ్యవధిలోగా, ప్రాధాన్య క్రమంలో పరిష్కరించే వీలుంటుంది.
వ్యాట్ హేతుబద్ధీకరణ: సహజ వాయువుపై వ్యాట్‌ను 5 శాతానికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ప్రోత్సహిస్తోంది. తద్వారా గృహోపయోగ పీఎన్‌జీ ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు ఇప్పటికే వ్యాట్‌ను తగ్గించాయి.
జాతీయ పీఎన్‌జీ కార్యక్రమం 2.0: దేశవ్యాప్తంగా మరిన్ని కుటుంబాలు పైపుల ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ వినియోగానికి మళ్లడానికి అనువైన పద్ధతులు అమలు చేస్తారు. ఈ మేరకు ఎల్‌పీజీ సిలిండర్ల వాపసుకు ఒక పోర్టల్ ఏర్పాటవుతుంది. ఇక ఇంటింటి ప్రచారం, అవగాహన శిబిరాలు, ఎల్‌పీజీ ఉపయోగించే హౌసింగ్ సొసైటీలను పీఎన్‌జీ వైపు మళ్లించడం తదితరాల కోసం దేశవ్యాప్త ప్రచారం చేపడతారు.
ఏకీకృత పీఎన్‌జీ రిజిస్ట్రేషన్ పోర్టల్: కొత్త పీఎన్‌జీ కనెక్షన్‌ల కోసం దరఖాస్తుల సమర్పణ, వాటి అనుశీలన ప్రక్రియలో సౌలభ్యం సహా వేగిరపరచడం ఏక గవాక్ష వేదికను రూపొందిస్తున్నారు.
దేశవ్యాప్తంగా గృహాలకు పైపులైన్ ద్వారా కాలుష్య రహిత, సురక్షిత, చౌక వంటగ్యాస్ లభ్యత విస్తరణకు ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోంది. దీనికి మరింత ఉత్తేజమిస్తూ గృహ పీఎన్‌జీ కనెక్షన్లను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కీలక ఏపీఎం/ఎన్‌ఏపీఎం ప్రోత్సాహక పథకాన్ని అమలులోకి తెస్తున్నారు.
పథకం స్వరూపం
అర్హతగల ‘సీజీడీ’ సంస్థలకు వాటి భౌగోళిక ప్రదేశం (జీఏ) పరిధిలో నిర్ధారిత కనీస పరిమితికి మించి పనితీరు కాలంలో నమోదయ్యే ప్రతి అదనపు బిల్లింగ్ దేశీయ పీఎన్‌జీ కనెక్షన్ మీద దేశీయంగా ఉత్పత్తి చేసిన చౌక గ్యాస్‌ను (ఏపీఎం) 200 ‘ఎస్‌సీఎం’ మేర అదనంగా కేటాయిస్తారు. ఈ పథకం ఆరు నెలల వ్యవధిలో రెండు విడతలుగా అమలవుతుంది. ప్రస్తుతం సీఎన్‌జీ రవాణా విభాగం కోసం ‘సీజీడీ’లు సేకరించే ఖరీదైన ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) స్థానంలో అదనంగా కేటాయించే ఏపీఎం గ్యాస్ లభించడం ద్వారా వాటికి గ్యాస్ కొనుగోలు వ్యయం తగ్గుతుంది.
ఈ విధంగా పొదుపు సమకూరడం వల్ల డీ-పీఎన్‌జీ కనెక్షన్లపై వెచ్చించే మూలధన వ్యయాన్ని ‘సీజీడీ’లు వాపసు పొందే కాలం 10 నుంచి సుమారు 3 సంవత్సరాలకు తగ్గుతుందని అంచనా. తద్వారా గృహ పీఎన్‌జీ అనుసంధాన వేగం మరింత పెంచేందుకు వాటికి బలమైన ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. మొత్తం మీద పైపుల ద్వారా సరఫరా అయ్యే కాలుష్య రహిత, సురక్షిత, చౌక ధర ‘పీఎన్‌జీ’తో దేశంలోని మరిన్ని ఎక్కువ గృహాలకు ప్రయోజనం సమకూరుతుంది.
***
(रिलीज़ आईडी: 2301048)
आगंतुक पटल : 18