ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్‌లోని లఖిసరాయ్‌లో జరిగిన దుర్ఘటన బాధితులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్–గ్రేషియా ప్రకటించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 AUG 2026 3:11PM by PIB Hyderabad

బీహార్‌లోని లఖిసరాయ్‌లో జరిగిన విషాద ఘటన బాధితులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్–గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని అందజేస్తామని పీఎం తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘బీహార్‌లో లఖిసరాయ్‌లో జరిగిన దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్‌ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌–గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందుతుంది.’’


(రిలీజ్ ఐడి: 2300454) సందర్శకుల సూచీ సంఖ్య : : 64