రక్షణ మంత్రిత్వ శాఖ
ఇండియా–థాయ్‌లాండ్ సంయుక్త సైనిక విన్యాసం: మైత్రీ–XV కోసం బయలుదేరిన భారత సైనిక బృందం
प्रविष्टि तिथि:
17 AUG 2026 10:59AM by PIB Hyderabad
భారత్–థాయిలాండ్ సంయుక్త సైనిక విన్యాసమైన మైత్రి–XV (2026)లో పాల్గొనేందుకు భారత సైనిక బృందం ఈ రోజు థాయిలాండ్‌కు బయలుదేరింది. ఈ15వ విడత విన్యాసాలు థాయిలాండ్‌లోని సూరత్ థానిలో ఉన్న విభవాది రంగసిత్ క్యాంప్‌లో 2026 ఆగస్టు 18 నుంచి 31 వరకు జరుగుతాయి. 2025, సెప్టెంబర్‌లో మేఘాలయలోని ఉమ్రోయ్‌లో ఉన్న ఫారిన్ ట్రైనింగ్ నోడ్‌లో మునుపటి విడత విన్యాసాలను నిర్వహించారు.
భారత సైన్యం, రాయల్ థాయ్ సైనిక బృందాల్లో ఒక్కొక్కదానిలోనూ 85 మంది సిబ్బంది ఉన్నారు. భారత సైనిక బృందంలో ప్రధానంగా 9 గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన దళాలు ఉన్నాయి. రాయల్ థాయ్ సైనిక బృందంలో అయిదో డివిజన్‌కు చెందిన 25వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్‌లోని మూడో బెటాలియన్ సిబ్బంది ఉన్నారు. ఈ విన్యాసాల్లో భాగంగా అటవీ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో కార్యకలాపాలపై దృష్టి సారించిన కంపెనీ స్థాయి సంయుక్త శిక్షణ ఉంటుంది.
భారతదేశం, థాయిలాండ్ మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించడమే ఈ మైత్రీ విన్యాసాల లక్ష్యం. ఈ విన్యాసాలు ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఏడో అధ్యాయం కింద అటవీ, సెమీ–అర్బన్ వాతావరణంలో తిరుగుబాటు/ఉగ్రవాద నిరోధక సంయుక్త కార్యకలాపాలను అమలు చేయడంలో ఉమ్మడి సామర్థ్యాలను ఈ విన్యాసాలు పెంపొందిస్తాయి. ఈ శిక్షణలో క్షేత్రస్థాయి విన్యాసాలు, పోరాట చర్చలు, ఉపన్యాసాలు, ప్రదర్శనలు, ముగింపు విన్యాసం ఉంటాయి. సంయుక్త విన్యాసాల్లో భాగంగా తమ కార్యకలాపాల అనుభవాన్ని పంచుకోవడంతో పాటు.. ఆధునిక పరికరాలను, సాంకేతిక పరిజ్ఞానాలను కాంటింజెంట్లు ప్రదర్శిస్తాయి.
భారత్, థాయిలాండ్ మధ్య ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడానికి, సైనిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ముఖ్యమైన వేదికగా 2026లో మైత్రి విన్యాసాలు ప్రారంభమయ్యాయి. రెండు దేశాల సైన్యం మధ్య పరస్పర కార్యాచరణ సామర్థ్యాన్ని, పరస్పర అవగాహనను, స్నేహభావాన్ని ఈ విన్యాసాలు పెంపొందిస్తాయి. తద్వారా రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తాయి.

***
(रिलीज़ आईडी: 2300334)
आगंतुक पटल : 18