జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

సీఆర్‌పీఎఫ్ అధికారిక గణాంకాల ప్రకారం.. జనవరి నుంచి మే 2026 మధ్య కాలంలో 19 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మరణించినట్లు వచ్చిన వార్తలపై సుమోటోగా విచారణకు స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ


నివేదికల ప్రకారం.. 2025లో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిలో అత్యధికంగా 59 ఆత్మహత్యలు

ఈ అంశంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని కోరుతూ హోం మంత్రిత్వ శాఖ, హోం కార్యదర్శి, సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు కమిషన్ నోటీసులు

प्रविष्टि तिथि: 14 AUG 2026 12:45PM by PIB Hyderabad

జనవరి నుంచి మే 22, 2026 మధ్య అయిదు నెలల కన్నా తక్కువ వ్యవధిలోనే 19 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్సిబ్బంది ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు వచ్చిన మీడియా కథనాన్ని భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీసుమోటోగా విచారణకు స్వీకరించిందిసీఆర్‌పీఎఫ్ గణాంకాల ప్రకారం... 2025లో ఆత్మహత్యల కారణంగా 59 మంది సిబ్బందిని ఈ దళం కోల్పోయిందినివేదికల ప్రకారం... గత అయిదేళ్లలో నమోదైన ఆత్మహత్యల్లో ఇదే అత్యధికం.

కమిషన్ పరిశీలన ప్రకారం... ఆ వార్తా కథనంలోని అంశాలు నిజమైతేదేశంలోని అతిపెద్ద కేంద్ర సాయుధ పోలీసు దళంలో పనిచేస్తున్న సిబ్బంది జీవించే హక్కు ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు కమిషన్ భావించిందిఈ అంశంపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ కార్యదర్శికిసీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది.

మీడియా నివేదిక ప్రకారం.. ఆగస్టు 11, 2026 నాటికి గడిచిన అయిదేళ్లలో మొత్తం 281 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఆత్మహత్య చేసుకుని మరణించారువీరిలో దాదాపు 216 మంది విధుల్లో ఉన్నవారుసీఆర్‌పీఎఫ్ విభాగంలో 2021లో 57, 2022లో 43, 2023లో 57, 2024లో 46, 2025లో 59 ఆత్మహత్యలు నమోదయ్యాయి.

****


(रिलीज़ आईडी: 2299376) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Marathi