సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ ఏఐ నైపుణ్య శిక్షణ కార్యక్రమం మొదటి దశలో 60,253 మంది నమోదు


పరిశ్రమలకు సంబంధించి ఏఐ నైపుణ్యాలను విద్యార్థులకు అందించేందుకు ఐఐసీటీ, ప్రైవేటు రంగ భాగస్వాములు సంయుక్తంగా అభివృద్ధి చేసిన పాఠ్యప్రణాళిక

प्रविष्टि तिथि: 12 AUG 2026 2:10PM by PIB Hyderabad

జాతీయ కృత్రిమ మేధ (ఏఐనైపుణ్య శిక్షణ కార్యక్రమం మొదటి దశలో ఇప్పటివరకు మొత్తం 60,253 మంది నమోదు చేసుకున్నారు.

ఈ కార్యక్రమం మొదటి దశలో మాడ్యూళ్లను 4,620 మంది పూర్తి చేయగా… మొదటి దశలోని మాడ్యూళ్లను 552 మంది పూర్తి చేశారు.

ఈ కార్యక్రమం మొదటి దశలో మొత్తం 33 గంటల వ్యవధితో నాలుగు మాడ్యూళ్లు ఉన్నాయివీటిని రెండు అభ్యాస వేదికల ద్వారా అందిస్తున్నారుమొదటి దశకు సంబంధించిన మాడ్యూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

వేదిక 1:

మాడ్యూల్ 1: ఏఐ ప్రాథమిక అంశాలు రోజువారీ ఉత్పాదకతను పెంచుకోవటానికిడేటాను సేకరించికంటెంట్‌ను సృష్టించటానికి అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలను పొందవచ్చు.

మాడ్యూల్ 2: ప్రాంప్టింగ్ ప్రాథమిక అంశాలు వృత్తిపరమైన ప్రాంప్టులను రాసేందుకు ఉపయోగపడే వ్యవస్థ.

వేదిక 2:

మాడ్యూల్ 3: జనరేటివ్ ఏఐ పరిచయం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎంప్రాథమికాంశాలనుబాధ్యతాయుతమైన ఏఐ మార్గదర్శకాలను అర్థం చేసుకోవచ్చు.

మాడ్యూల్ 4: జనరేటివ్ ఏఐ లీడర్ వర్క్ ఫ్లో ఆటోమేషన్వ్యూహాత్మక జనరేటివ్ ఏఐ సంస్థాగత పరివర్తనను తెలుసుకోవచ్చు.

సిలబస్మాడ్యూళ్లుకోర్సు వ్యవధి వంటి రెండో దశకు సంబంధించిన వివరాల తుది రూపకల్పన జరుగుతోంది.

ప్రాథమికఆచరణాత్మక ఏఐ నైపుణ్యాలను అందించేందుకు ఐఐసీటీప్రైవేటు రంగ భాగస్వాములు సంయుక్తంగా పాఠ్యప్రణాళికను రూపొందించిఅభివృద్ధి చేశారుసంయుక్త ధ్రువీకరణకు ఇందులోని అధునాతన నైపుణ్య శిక్షణను ఐఐసీటీ ద్వారా నిర్వహిస్తారు.

ఏఐ అక్షరాస్యతను పెంపొందించటంపరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో ఐఐసీటీ ద్వారా ఈ కార్యక్రమం అమలవుతుందిదీనికి వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తూఅమలును సులభతరం చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఇవాళ లోక్‌సభలో అడ్వొకేట్ గోవాల్ కాగడా పదవీఅడిగిన ప్రశ్నకు సమాధానంగా సమాచారప్రసారపార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్మురుగన్ లిఖితపూర్వకంగా ఈ సమాచారాన్ని అందించారు.

 

****


(रिलीज़ आईडी: 2298407) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam