హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మరో 11 అంతర్జాతీయ పోర్టులను నోటిఫై చేసిన భారత ప్రభుత్వం

ఇ-వీసాతో విదేశీయులు భారత్‌లోకి ప్రవేశించేందుకు మార్గం సుగమం

ఇ-వీసాతో విదేశీయుల ప్రవేశం కోసం అందుబాటులో ఉన్న దేశంలోని అంతర్జాతీయ పోర్టుల సంఖ్య ఇప్పుడు 88కి పెరిగింది

11 అంతర్జాతీయ పోర్టుల చేరికతో పెరగనున్న ఎలక్ట్రానిక్ వీసా ప్రాధాన్యం, వినియోగం

సుమారు 95 శాతం ఇ-వీసా దరఖాస్తులను 72 గంటల్లోపే జారీ చేస్తున్న భారత్

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శనం, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో... వీసా విధాన సరళీకరణ, క్రమబద్ధీకరణ, సులభతరం కోసం గత కొన్నేళ్లుగా పలు కీలక చర్యలు చేపట్టిన ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 10 AUG 2026 5:43PM by PIB Hyderabad

ఇ-వీసా కలిగిన విదేశీయులు భారత్‌లోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తూ, భారత ప్రభుత్వం మరో 11 అంతర్జాతీయ ప్రవేశ కేంద్రాలను (పోర్టులను) నోటిఫై చేసింది. కొత్తగా చేర్చిన ఈ 11 కేంద్రాల్లో 9 భూమార్గ ప్రవేశ కేంద్రాలు, 2 విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ అదనపు కేంద్రాల ఏర్పాటుతో ఎలక్ట్రానిక్ వీసా (ఇ-వీసా) ప్రాధాన్యం, వినియోగం మరింత పెరుగుతాయి. దీని ద్వారా దాదాపు 95 శాతం ఇ-వీసా దరఖాస్తులను భారత్ 72 గంటల్లోపే జారీ చేస్తోంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శనం, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో... గత కొన్నేళ్లుగా చట్టబద్ధమైన విదేశీ ప్రయాణికులకు సౌకర్యం కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం వీసా విధానాన్ని సరళీకరించడం, క్రమబద్ధీకరించడం, సులభతరం చేయడం లక్ష్యంగా పలు కీలక చర్యలు చేపట్టింది. అంతర్గత భద్రతను పెంపొందించడానికి సాంకేతిక మౌలిక సదుపాయాల కల్పననూ వేగవంతం చేసింది.

కొత్త పోర్టుల చేరికతో, ఇ-వీసా కలిగిన విదేశీయులు భారత్‌లోకి ప్రవేశించడానికి వీలు కల్పించే అంతర్జాతీయ ప్రవేశ కేంద్రాల మొత్తం సంఖ్య 88కి పెరిగింది. ఇందులో 37 విమానాశ్రయాలు, 38 ఓడరేవులు, 13 ల్యాండ్ పోర్టులూ ఉన్నాయి.

ఇ-వీసా కలిగిన విదేశీయులు భారత్‌లోకి ప్రవేశించడాన్ని సులభతరం చేసే అంతర్జాతీయ పోర్టుల జాబితా - ఈ తేదీ నాటికి అందుబాటులో ఉన్నవి


(రిలీజ్ ఐడి: 2297398) సందర్శకుల సూచీ సంఖ్య : : 84