ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పాల్గొనాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 09 AUG 2026 7:20PM by PIB Hyderabad

హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలనీ, వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడాలన్న ఉమ్మడి సంకల్పంతో ముందుకు రావాలనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతదేశ ప్రతిష్ఠకు త్రివర్ణ పతాకం చిహ్నమనీ, దేశం కోసం తమ వంతు కృషి చేయడానికి ప్రతి పౌరునికీ నిరంతరం స్ఫూర్తినిస్తుందనీ  శ్రీ మోదీ అన్నారు.

జాతీయ గేయం 150వ వార్షికోత్సవాలను దేశం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని వందేమాతరానికి అంకితం చేయడం పట్ల శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని పోస్టు:

మన త్రివర్ణ పతాకం మనకు గర్వకారణం. దేశం కోసం ఉత్తమ రీతిలో కృషి చేయడంలో ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తోంది.

హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో మనందరం ఉత్సాహంగా పాల్గొందాం. వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పడాలనే ఉమ్మడి లక్ష్యాన్ని పునరుద్ధరించుకుందాం. వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రయత్నాలను జాతీయ గేయానికి అంకితం చేయడం హర్షణీయం.

https://harghartiranga.com

 

*** 


(రిలీజ్ ఐడి: 2296903) సందర్శకుల సూచీ సంఖ్య : : 62