నాడు పోస్టు చేయడమైనది:
08 AUG 2026 11:05PM by PIB Hyderabad
అమెరికా ఉపాధ్యక్షుడు శ్రీ జేడీ వాన్స్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు.
భారత్-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని ప్రధానమంత్రి, ఉపాధ్యక్షుడు సమీక్షించారు. ఉన్నత స్థాయి సమావేశాల్లో కొనసాగుతున్న వేగాన్ని వారు గుర్తించారు. వాణిజ్యం, రక్షణ రంగం, కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, ఇంధన భద్రత, కీలకమైన ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో తమ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించారు.
పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను వారు పంచుకున్నారు.
ఉపాధ్యక్షుడు వాన్స్, శ్రీమతి ఉషా వాన్స్‌కు కుమారుడు జన్మించిన సందర్భంగా ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. వారి కుటుంబానికి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.
***